AP Weather : ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ నివేదిక ఇది..

APలో Southwest Monsoon చురుగ్గా విస్తరిస్తున్నాయి. తదుపరి కదలికకు అనుకూలమైన అవకాశాలు కనిపిస్తాయి. రుతుపవనాలు ఇప్పటికే Rayalaseema తో పాటు AP లోని దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రెండు, మూడు రోజుల్లో APతో పాటు తెలంగాణలోనూ పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. కోస్తా వెంబడి తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో APకి ఐదు రోజుల పాటు వర్ష సూచనను వాతావరణ శాఖ ప్రకటించింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురంమణియం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

Related News

మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.