ఆంధ్రప్రదేశ్ లోని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే అనేక హామీలను నిలబెట్టుకోగా, ప్రస్తుతం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉంది. మరో పథకం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఒక కార్యక్రమానికి మంత్రి హాజరై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
సూపర్ సిక్స్ పథకాలలో కీలకమైన భాగమైనతల్లికి వందనం పథకంపై మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే నెల నుండి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని రూ.4 వేల పెన్షన్ ఏపీలో మాత్రమే అందిస్తున్నామని, సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలుగా అధికారంలో ఉందని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో, తల్లికి వందన ప్రతి విద్యార్థికి 15 వేలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు మంత్రి స్వామి కీలక ప్రకటన చేశారు.
Related News
ఈ పని తప్పని సరి..
దీనికి సంబంధిచి ప్రతి తల్లి తమ ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యేలా సచివాలయం లో చూసుకోవాలని. లేని చొ సొమ్ము సంబంధిత ఖాతాలో జమ అవ్వక పోతే ఇబ్బందులు పడతారు.. మీ బ్యాంకు అకౌంట్ కి మీ ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి.. అలానే ఆ నెంబర్ మీ ఆధార్ కి కూడా లింక్ అయ్యేలా చూసుకోవాలి..
మే నెల లోపు విద్యార్థుల తల్లులు ఈ పని తప్పని సరిగా చేయాలి..