వైఎస్ జగన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. Greater Visakha Municipal Corporation-VMRDA సంయుక్తంగా అభివృద్ధి చేసిన రూ.1500 కోట్ల అభివృద్ధి పనులను మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం Radisson Blu Hotel లో జరిగిన విజన్ విశాఖ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో 2 వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు.
ఈ సందర్భంగా విజన్ Visakha booklet. ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. 8:48 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో వైఎస్ జగన్ అంతరంగాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఐదేళ్లలో విశాఖపట్నంలో అన్ని అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. nfosys, Adani data center investments, జాతీయ రహదారులు, Vizag port connectivity ని వివరించారు. పూర్తిస్థాయి రాజధానిగా మార్చిన తర్వాత వాహనాల రాకపోకలను సాఫీగా సాగించేందుకు flyovers, underpasses లు, Visakhapatnam Metro ప్రాజెక్టు మొదలైనవి ఇందులో ఉన్నాయి. అలాగే- Executive Capital City గా అవతరించిన తర్వాత విశాఖలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల కార్యాలయాల డిజైన్లను కూడా ఇందులో పొందుపరిచారు. రాష్ట్ర స్థాయి సచివాలయ డిజైన్ ఎలా ఉంటుందో వివరించారు. సచివాలయ నమూనాను దీపం ఆకారంలో రూపొందించారు
Related News
ఈ సందర్భంగా జగన్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. విశాఖను పూర్తిగా కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తామని, ఇక్కడే ఉంటానని చెప్పారు. విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తామన్నారు. ఈ నగరాన్ని ఆర్థికాభివృద్ధికి ఇంజన్గా మారుస్తామని జగన్ అన్నారు.