AP Mega DSC Notification 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇటీవలే ఏపీపీఎస్సీ గ్రూప్-1 & 2 నోటిఫికేషన్ వెలువడి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఏపీపీఎస్సీ అధికారులు నాలుగైదు నోటిఫికేషన్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది MEGA DSC నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తాం అని మంత్రి గారు ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జనవరి 13 (శనివారం) సాయంత్రం ప్రకటించారు.

Related News

జిల్లావారి పోస్ట్ ల వివరాలు కేడర్ వారి ఖాళీ ల వివరాలు తమ వద్ద ఉన్నాయని.. ముఖ్యమంత్రి గారితో చర్చ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రి గారు వివరించారు.

మెగా డీఎస్సీ పోస్టుల విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్తో చర్చించామని తెలిపారు.