ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని , సూపర్ సిక్స్ అమలుపై దృష్టి సారించింది.
పింఛను రూ.4వేలకు పెంపుతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఇప్ప టికే మ హిళ ల కు ఉచిత బ స్సు ప్ర యాణం అమ లు చేసేందుకు ప్ర య త్నాలు జ రుగుతున్నాయి. ఈమేరకు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలుపై ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది.
ప్రభుత్వ ప్రయత్నాలు
Related News
ఏపీలో మహిళలకు ఉచిత బస్సులు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి నివేదిక కోరారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన ఆర్టీసీ ఉన్నతాధికారులు అక్కడ అమలవుతున్న ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం.. లోటు భర్తీ, మహిళలకు అమలు చేయడం ద్వారా పురుషుల అభిప్రాయాలు.. ఆటో వాలాల నుంచి వస్తున్న అభ్యంతరాలపై చర్చించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.
మంత్రి తాజా ప్రకటన
ఇప్పుడు రాష్ట్రంలో ఈ పథకం అమలుకు సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. APSRTC ప్రజల కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీసును మంత్రి ప్రారంభించారు. కార్గో సర్వీస్ డోర్ డెలివరీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందిని మరింత చేరువ చేసేందుకు డోర్ డెలివరీ సేవలను ప్రారంభించామన్నారు. ప్రయాణికుల కోసం మంచి బస్సులను సిద్ధం చేశామన్నారు. మరికొద్ది రోజుల్లో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
సంక్రాంతికి లాంచ్
కొత్త సంవత్సరం ప్రారంభమైన జనవరి నెలలో ఈ పథకం అమలు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ముందుగా ఏ కేటగిరీ బస్సుల్లో అమలు చేయాలన్నది తెలుస్తోంది. అయితే ఏసీ బస్సులు మినహా అన్ని కేటగిరీల్లో అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా సమాచారం. దీంతో సంక్రాంతి నాటికి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.