AP DSC Notification Cancelled: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ GO NO- 256 ను విడుదల చేసింది.
వైసీపీ ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి మెగా డీఎస్సీపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. రేపు 16,347 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
కొత్త మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు?
Related News
మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయగా, మంత్రి నారా లోకేష్ కూడా నిబంధనలపై సంతకం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించింది. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే టెట్ ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి TET నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. DSC తో పాటు AP TET పరీక్ష కూడా నిర్వహిస్తారు.
16,347 పోస్టులు
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. తొలి మెగా డీఎస్సీ ఫైలుపై చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీలు)-1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీలు)-286, ప్రధానోపాధ్యాయులు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 మంది ఉన్నారు.
- స్కూల్ అసిస్టెంట్ – 7,725
- SGT – 6371
- TGT – 1781
- PGT – 286
- PET – 132
- ప్రధానోపాధ్యాయులు – 52
జిల్లాల వారీగా ఖాళీలు
- ఉమ్మడి శ్రీకాకుళం 543,
- విజయనగరం, 583,
- విశాఖపట్నం 1,134,
- తూర్పు గోదావరి 1,346,
- పశ్చిమ గోదావరి 1,067,
- కృష్ణ 1,213,
- గుంటూరు 1,159,
- ప్రకాశం 672,
- నెల్లూరు 673,
- చిత్తూరు 1,478,
- కడప, 709,
- అనంతపురం 811,
- కర్నూలు 2,678
ఇవి కాకుండా రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన పాఠశాలల్లో 2,281 ఖాళీలు ఉన్నాయి.
మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు.