ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, సభ్యులను తొలగించింది.
అదేవిధంగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా గ్రంథాలయాల చైర్మన్లను కూడా తొలగించింది.
ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులను సంకీర్ణ ప్రభుత్వం త్వరలో భర్తీ చేసే అవకాశాలు ఉన్నందున, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమించబడిన వారందరినీ తొలగించినట్లు తెలుస్తోంది.