AP Weather: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.

IMD ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మరో రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుంది. మరోవైపు వాయుగుండం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి వ్యాపించింది.

దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో (12, 13, 14) రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Related News

రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణం కింది విధంగానే ఉంటుందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

సోమవారం, నవంబర్ 11:

• కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం, నవంబర్ 12:

• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, మరియు ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం, నవంబర్ 13:

• కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, YSR, మరియు తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• NTR, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం, నవంబర్ 14:

• తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• కాకినాడ, కోనసీమ, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.