
ఉద్యోగాలు కోరుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పోస్టులను ప్రవేశపెట్టింది. వీటికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని పాడేరు, రంపచోడవరం డివిజన్‌లలో ప్రధానమంత్రి జనమాన్ పథకంలో కొత్తగా పోస్టులు మంజూరయ్యాయి.
ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ప్రకటించారు. అర్హులైన మహిళా అభ్యర్థులు డిసెంబరు 20, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారికి నేరుగా లేదా తపాలా ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
Eligibility and apply:
[news_related_post]అంగన్‌వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ప్రధానంగా స్థానికంగా నివాసం ఉంటూ, వివాహితులు అయి ఉండాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు జూలై 1, 2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని, 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు లేకుంటే, 18 సంవత్సరాలు నిండిన వారి దరఖాస్తులను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. .