ఢిల్లీ హైకోర్టు అమెజాన్ టెక్నాలజీస్ పై భారీ జరిమానా విధించింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘బెవర్లీ హిల్స్ పోలో క్లబ్’ (Beverly Hills Polo Club – BHPC) ట్రేడ్మార్క్ హక్కులను ఉల్లంఘించిన కేసులో, Amazon ₹340 కోట్లు లైఫ్‌స్టైల్ ఎక్విటీస్‌కి చెల్లించాలని తీర్పునిచ్చింది.
అమెజాన్ మోసపూరిత వ్యూహాలు – కోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యాయమూర్తి ప్రతిభా సింగ్ నేతృత్వంలో విచారణ జరిగిన ఈ కేసులో, అమెజాన్ టెక్నాలజీస్ సంస్థ ఉద్దేశపూర్వకంగా లైఫ్‌స్టైల్ కంపెనీకి నష్టం కలిగించిందని కోర్టు స్పష్టం చేసింది.
- లైఫ్‌స్టైల్ బ్రాండ్ అసలు ధర కంటే 90% తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా, మిడిల్మాన్, సెల్లర్, బ్రాండ్ యజమాని అనే మూడు వేర్వేరు పాత్రలు పోషిస్తూ, తమపై ఉన్న బాధ్యతను తప్పించుకునేందుకు ప్రయత్నించిందని కోర్టు తీవ్రంగా విమర్శించింది.
- అమెజాన్ గ్రూప్‌లోని మూడుసంస్థలు (Amazon Technologies, Cloudtail India, Amazon Seller Services) పరస్పర సంబంధం గురించి స్పష్టత ఇవ్వకుండా కోర్టును మోసగించేందుకు ప్రయత్నించాయి అని కోర్టు తేల్చిచెప్పింది.
- కోర్టు విచారణకు హాజరయ్యే సందర్భాలను అమెజాన్ తనకు అనుకూలంగా ఎన్నుకుంటోందని కోర్టు పేర్కొంది.
అమెజాన్‌పై శాశ్వత నిషేధం
అమెజాన్ ఇకపై ‘బెవర్లీ హిల్స్ పోలో క్లబ్’ ట్రేడ్మార్క్‌తో ఏ విధమైన ఉత్పత్తులు విక్రయించకూడదని, ప్రచారం చేయకూడదని కోర్టు శాశ్వత నిషేధాన్ని విధించింది. ఈ విషయంపై అమెజాన్ సమర్థన ఇచ్చేందుకు కూడా స్పష్టత ఇవ్వలేదని కోర్టు తెలిపింది.
Related News
భారత మార్కెట్లో లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రాముఖ్యత
‘బెవర్లీ హిల్స్ పోలో క్లబ్’ బ్రాండ్ 2007లో భారత మార్కెట్లో ప్రవేశించింది. అత్యంత విలాసవంతమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా పేరుగాంచిన ఈ సంస్థ భారతదేశం & అంతర్జాతీయ మార్కెట్లో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఈ బ్రాండ్ తమ హక్కులను ఉల్లంఘించారని అమెజాన్‌పై శాశ్వత నిషేధం & భారీ జరిమానా విధించాలని కోర్టును ఆశ్రయించింది.
న్యాయమూర్తి ఘాటుగా స్పందిస్తూ…
న్యాయమూర్తి ప్రతిభా సింగ్ మాట్లాడుతూ,
“అమెజాన్ తన మూడుసంస్థల మధ్య సంబంధాన్ని కోర్టు ముందు వెల్లడించకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఇది న్యాయసమ్మతమైన ప్రవర్తన కాదని స్పష్టంగా అర్థమవుతోంది. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
ఇకపై అమెజాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
ఈ తీర్పుతో అమెజాన్ టెక్నాలజీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెజాన్ ₹340 కోట్ల జరిమానా చెల్లించాలన్న కోర్టు ఆదేశాన్ని పాటిస్తుందా? లేదా ఇంకా హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందా? అనే విషయం వేచి చూడాలి!