హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేస్తూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
గేటు లోపలికి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు. అయితే దాడి సమయంలో బన్నీ ఇంట్లో లేడని తెలుస్తోంది. బన్నీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో, అతని మామ చంద్రశేఖర్ ఘటనపై ఆరా తీశారు.
పిల్లలు అయాన్ మరియు అర్హలను అల్లు అర్జున్ సిబ్బంది అతని ఇంటికి తీసుకెళ్లారు. కాగా తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.