Allu Arjun Interrogation : ప్రస్తుతం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun ) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ‘పుష్ప 2’ ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసలాట ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే.
ఈ కేసు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాడు, ఈ కేసు మాత్రం అల్లు అర్జున్ ను వీడకుండా వెంటాడుతూనే ఉంది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని కొందరు అంటుంటే, అంతా అల్లు అర్జున్ వల్లే జరిగింది మరికొంత మంది అంటున్నారు. ప్రభుత్వం ఈ పరీక్షను వదిలి పెట్టేలా కనిపించట్లేదు.
తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun ) ను మరోసారి పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను ఇప్పటికే పోలీసులు 18 ప్రశ్నలు అడిగినట్టుగా ఉన్నాయి. అందులో భాగంగా అల్లు అర్జున్ చెప్పే ప్రతి ఆన్సర్ ను వీడియో ద్వారా రికార్డ్ చేయడానికి సమాచారం. కేవలం వీడియో రికార్డు కాదు, అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను టైపింగ్ కూడా చేసినారు .
Related News
అయితే విచారణలో భాగంగా సంధ్య థియేటర్ లోపలికి అల్లు అర్జున్ (Allu Arjun ) వస్తున్న వీడియో, ఆ తర్వాత థియేటర్ లోపల ఆయన కూర్చున్న వీడియో, బయటకు వెళ్తున్న వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించారని సమాచారం. ఆ వీడియోలను చూపించి ప్రశ్నలు అడగడంతో అల్లు అర్జున్ మౌనం వహించినట్లుగా చూపిస్తున్నారు. అయితే రేవతి మృతిపై పోలీసుల వద్ద అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేస్తూ, ఇలా జరుగుతుందని ఊహించలేదు తప్పు జరిగింది అని సమాధానం చెప్పారని అంటున్నారు.
తన పిఆర్ టీం తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదు , 50 మందికి పైగా బౌన్సర్లను పెట్టడం తప్పేనని అల్లు అర్జున్ విచారణలో ఒప్పుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి విచారణ ఇంకా కొనసాగుతుండగా, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
ఇక ఇప్పుడు సర్వత్రా అల్లు అర్జున్ (Allu Arjun ) గురించే చర్చ నడుస్తోంది. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఎక్కడ చూసినా ఇదే టాక్. చాలామంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదు అంటుంటే, కొంతమంది రాజకీయ నాయకులు టీఎస్ ప్రభుత్వం కావాలనే బన్నీని టార్గెట్ చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు సినిమా వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ విచారణ తర్వాత పోలీసులు ఏం చేయబోతున్నారు? ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ఎలా తప్పించుకోబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.