Allu Arjun: అల్లు అర్జున్‏కు రెగ్యులర్ బెయిల్ మంజూరు..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

కోటి రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. 50 వేలు, ఇద్దరు పూచీకత్తు. డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.ఆమె మృతికి అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యమే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. రేవతి మృతికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బన్నీ రాగానే అక్కడ తొక్కిసలాట జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. బన్నీకి బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించడు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని పీపీ వాదించింది. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనతో బన్నీకి ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అల్లు అర్జున్‌కు బీఎన్‌ఎస్ సెక్షన్ 105 వర్తించదని ఆయన అన్నారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు ఏమాత్రం వర్తించదని అన్నారు. తాజా విచారణ అనంతరం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

Related News

మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్‌ గడువు ముగియడంతో వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు శుక్రవారం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *