ప్రైవేట్ రంగ దిగ్గజం HDFC బ్యాంక్ మరోసారి డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. గత రెండు సార్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా బ్యాంకులు డిపాజిట్లు మరియు రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.
ఏప్రిల్లో ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన HDFC బ్యాంక్, ఇప్పుడు మరో 20 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. రూ. 3 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీని ఈ మేరకు తగ్గించింది. సవరించిన రేట్లు మే 23 నుండి అమల్లోకి వచ్చాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
కొత్త రేట్లు సాధారణ కస్టమర్లకు 3-6.85 శాతం మధ్య వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.5 శాతం నుండి 7.35 శాతం మధ్య రాబడిని ఇస్తుంది. సవరించిన రేట్లు కొన్ని కాలాలకు మాత్రమే వర్తిస్తాయి. వాటిలో, ఒకటి నుండి 15 నెలల కాలానికి వడ్డీ రేటును 6.60 శాతం నుండి 6.50 శాతానికి 10 బేసిస్ పాయింట్లు తగ్గించారు. 18 నెలల నుంచి 21 నెలల కాలానికి 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.05 శాతం నుంచి 6.85 శాతానికి, రెండు నుంచి మూడు సంవత్సరాల కాలానికి 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.90 శాతం నుంచి 6.70 శాతానికి పెంచారు. వడ్డీ రేట్లలో ఇదే తగ్గింపు సీనియర్ సిటిజన్లకు కూడా వర్తిస్తుంది.