AP EAP Cet 2025 : అలెర్ట్.. ఏపీ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం JNTU కాకినాడ AP EAP CET 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఫార్మసీ, వ్యవసాయ కోర్సులకు EAP SET ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ AP EAP CET 2025 కోసం దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15 నుండి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు: మే 19, 20 తేదీలలో నిర్వహించబడతాయి.

Related News

ఇంజనీరింగ్ పరీక్షలు: మే 21 నుండి 27 వరకు జరుగుతాయి.

దరఖాస్తు రుసుము: SC, ST, PWD అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 500 చెల్లించాలి.

ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ. 900 ఫీజు చెల్లించాలి.

రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకుంటే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి.

మిగిలిన అభ్యర్థులు రూ. 1800 చెల్లించాలి.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఫార్మసీ, వ్యవసాయ కళాశాలలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ పరీక్షల సెట్ నిర్వహిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలను పొందడానికి cets.apsche.ap.gov.in లింక్‌పై క్లిక్ చేయండి.