హైదరాబాద్, జూన్ 11 : రాష్ట్రంలో 70ఏండ్లకు పైబడిన పెన్షన్‌దారులకు, కుటుంబ పెన్షన్‌దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- 70 నుంచి 75 ఏండ్లలోపు వారికి బేసిక్ పెన్షన్‌పై 15శాతం,
- 75 నుంచి 80 ఏండ్లలోపు వారికి 20శాతం,
- 80 నుంచి 85 ఏండ్లలోపు వారికి 30శాతం,
- 90 నుంచి 95 ఏండ్లలోపు వారికి 50శాతం,
- 95 నుంచి 100 ఏండ్లలోపు వారికి 60శాతం,
- 100ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్‌దారులకు 100శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుంది.