ACB Notice: రాష్ట్రంలో సంచలనం.. కేటీఆర్‌కు మరోసారి ACB నోటీసులు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరుకావాలని సోమవారం సాయంత్రం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మరోవైపు గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసంలో (ఓరియన్ విల్లాస్) ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే తన ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తామని కేటీఆర్ ఈరోజు (జనవరి 06) ఉదయం మీడియాతో చెప్పడం గమనార్హం.

ఆయన చెప్పినట్లుగానే సాయంత్రం ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు సోదాలు జరుగుతుండగా.. మరోవైపు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫార్ములా రేస్ కేసులో ఇప్పటికే కేటీఆర్ ఏ1గా ఉండగా, ఏసీబీ, ఈడీ ఒకదాని తర్వాత ఒకటి నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్.. తన లాయర్ ను అనుమతించకపోవడంతో తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

Related News