Allu Arjun: అరుదైన గౌరవం – ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ మ్యాగజైన్ పై అల్లు అర్జున్.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ న్యూస్ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు భారతదేశంలో ‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’గా పునఃప్రారంభించబడుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారతదేశంలో ఈ మ్యాగజైన్ యొక్క మొదటి సంచికను అల్లు అర్జున్ కవర్‌పై తీసుకువస్తున్న విషయం గమనార్హం. అల్లు అర్జున్: ది రూల్ అనే కవర్ స్టోరీ కూడా రూపొందించబడింది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు చిత్రం పుష్ప-2 హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేర్కొంది. అల్లు అర్జున్‌ను స్టార్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2: ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,871 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది.

Related News