మనం రోజు చూస్తూనే ఉంటాము స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు.. ఇలా చాలా చోట్ల మరియు ఆఫీస్ లలో ఎ4 పేపర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రింట్ మీడియా సంస్థల్లో వీటి ఉపయోగం చెప్పక్కర్లేదు.
అయితే ఇవే ఎ4 పేపర్లను మనమే తయారు చేసి మార్కెట్‌లో అమ్మితే చక్కని లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని చక్కని ఆదాయ మార్గం గా కూడా మార్చుకోవచ్చు. సుదీర్ఘకాలం పాటు ఇందులో కొనసాగితే పెద్ద ఎత్తున లక్షల్లో లాభాలను కూడా పొందవచ్చు. ఈ రోజు ఎ4 పేపర్ల తయారీ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఖర్చవుతుందో.. ఎంత వరకు ఆదాయం సంపాదించవచ్చో.. తెలుసుకుందామా..!
ఎ4 పేపర్ల తయారీకి పేపర్ రోల్ మేకింగ్ పరికరం అవసరం అవుతుంది. దీని ఖరీదు రూ.5 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఎ4 పేపర్లను తయారు చేసేందుకు GSM ఎ4 పేపర్ రోల్స్ అవసరం అవుతాయి. ఒక్కో కేజీ రోల్ ఖరీదు రూ.60 వరకు ఉంటుంది. వీటిని Indiamart వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా ఇంట్లో ప్రత్యేకంగా ఒక రూం ఉంటే.. ఇంట్లోనే ఈ మెషిన్‌ను పెట్టి ఎ4 పేపర్లను తయారు చేసి అమ్మకాలు చేపట్టవచ్చు . మెషిన్‌లో ఎ4 పేపర్ రోల్స్‌ను పెట్టి వాటిని పేపర్లుగా కట్ చేయాలి. అనంతరం వాటిని ప్యాక్ చేసి విక్రయించాలి.
Related News
ఎ4 పేపర్ బండిల్స్ ధర పేపర్ల GSM క్వాలిటీని బట్టి ఉంటుంది. సాధారణంగా ఒక్క ఎ4 పేపర్ బండిల్ తయారీకి రూ.100 వరకు ఖర్చవుతుంది. దాన్ని మార్కెట్‌లో రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయించవచ్చు. దీంతో ఒక్క బండిల్‌పై ఎంత లేదన్నా కనీసం రూ.150 మార్జిన్ వస్తుంది. ఈ క్రమంలో నిత్యం 50 బండిల్స్‌ను తయారు చేసినా 50 * 100 = రూ.5000 వస్తాయి. అదే నెలకు అయితే 30 * 5000 = రూ.1,50,000 వస్తాయి. ఇలా నెల నెలా లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.
ఇక ఈ వ్యాపారానికి గాను మార్కెటింగ్ బాగా చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సముదాయాల వారితో టై అప్ అయి ఎ4 పేపర్ బండిల్స్‌ను తరచూ సప్లయి చేయవచ్చు. దీంతో ఈ బిజినెస్‌లో చక్కని లాభాలు రావడంతోపాటు సుదీర్ఘకాలంపాటు ఇందులో కొనసాగి.. ఆదాయం సంపాదించవచ్చు. ఇక బిజినెస్ ఎక్కువగా అయ్యే ప్రాంతంలో మార్కెటింగ్ చేస్తే.. లాభదాయకంగా ఉంటుంది. దీంతో సప్లయి పెంచుకుని, ప్రొడక్షన్ ఎక్కువ చేసి.. ఆ మేర లాభాలను పొందవచ్చు..!