
మార్కెట్లో బడ్జెట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ ఫోన్‌ను మీ లిస్టులో పెట్టుకోవాల్సిందే. ఎక్కువ ఖర్చు చేయకుండా కూడా అదిరిపోయే ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే టెక్నో పోవా 6 నియో ఖచ్చితంగా మీరు వెతికే ఫోన్. ఫీచర్లు గానీ, లుక్స్ గానీ చూస్తే ఇది నిజంగా ప్రీమియం ఫోన్ అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే దీని ధర కేవలం ₹11,999 మాత్రమే!
టెక్నో పోవా 6 నియోలో 6.67 అంగుళాల హెచ్డీ+ LCD డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే స్క్రోల్ చేయడం, వీడియోలు చూడటం, గేమింగ్ అన్నీ సాఫీగా సాగిపోతాయి. ఈ ఫోన్ Android 14 ఆధారిత HIOS మీద నడుస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ కూడా సింపుల్‌గా ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్లో 108 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది. ఇది 3x ఇన్-సెన్సార్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే దూరంలో ఉన్న దృశ్యాలనూ క్లియర్‌గా ఫోటోలు తీయవచ్చు. ఫ్రంట్ కెమెరా 8MP ఉండడంతో సెల్ఫీ, వీడియో కాల్స్‌కు బాగానే పని చేస్తుంది.
[news_related_post]కేవలం కెమెరా కాదు, ఇందులో ఉన్న ఏఐ ఫీచర్లు అసలే ప్రత్యేకం. ఏఐ మ్యాజిక్ ఎరేజర్, కటౌట్, ఏఐ వాల్‌పేపర్ లాంటి ఫీచర్లు క్రియేటివ్‌గా ఫోటోలు ఎడిట్ చేయడానికి బాగా సహాయపడతాయి. ఫోటో తీసిన వెంటనే మంచి లుక్ వచ్చేలా ఫోన్ పని చేస్తుంది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.
పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు ఇది తక్కువ ధరలో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీని బ్యాటరీ 5000mAh కెపాసిటీతో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం వాడొచ్చు. పైగా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో తక్కువ టైంలో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఆడియో ఎక్స్‌పీరియెన్స్ కోసం డాల్బీ అట్మోస్ స్పీకర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. అంటే వీడియోలు చూడడమో, మ్యూజిక్ వినడమో.. సౌండ్ క్వాలిటీ అదిరిపోతుంది.
ఈ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్లో సెప్టెంబర్ 2024లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ₹11,999కి లభిస్తుంది. ఇంత ఫీచర్లు కలిగి ఉన్న ఫోన్‌ను ఈ ధరలో ఇప్పుడు దొరకడం కష్టమే. అందుకే స్టాక్ అయిపోయేలోపు మీరు ఆర్డర్ పెట్టేయండి. ఆలస్యం చేస్తే మిస్ అవుతారు!