
మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే విడా వీఎక్స్2 మీకో మంచి ఆప్షన్ అవుతుంది. ఈ మధ్యే భారత్‌లో లాంచ్ అయిన ఈ స్కూటర్ ఇప్పుడు మోస్ట్ అఫార్డబుల్ ఈ-స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి – విడా వీఎక్స్2 గో మరియు వీఎక్స్2 ప్లస్.
విభిన్న రైడింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించారు. వీఎక్స్2 గో ధర రూ.99,490 ఉండగా, ప్లస్ వేరియంట్ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధరలు). కానీ, మీరు బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్ ప్లాన్ ఎంచుకుంటే ధరలు చాలా తక్కువగా ఉంటాయి. గో వేరియంట్ కేవలం రూ.59,490కే లభిస్తోంది. ప్లస్ వేరియంట్ రూ.64,990కే దొరుకుతోంది.
ఈ స్కీమ్‌లో మీరు కిలోమీటరుకు కేవలం రూ.0.96 చెల్లిస్తే చాలు. అంటే రోజూ ప్రయాణించే వారు తక్కువ ఖర్చుతో దీన్ని ఉపయోగించొచ్చు.
[news_related_post]విభిన్న పనితీరు ఈ స్కూటర్లకు హైలైట్. గో వేరియంట్లో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 92 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.
వీఎక్స్2 ప్లస్ వేరియంట్ మరింత శక్తివంతం. ఇందులో రెండు రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. వీటి సామర్థ్యం 3.4 కేడబ్ల్యూహెచ్. దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. పైగా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఒక గంటలో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. రెగ్యులర్ ఛార్జర్‌తో ఆరు గంటల్లో ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ స్కూటర్ కేవలం 3.1 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. టాప్ స్పీడ్ 80 కేఎంపీహెచ్.
ఈ స్కూటర్లో 33.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. పెద్ద బూట్ స్పేస్, ఫ్రంట్ కంపార్ట్మెంట్ వల్ల రోజూ ప్రయాణించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పొడవైన సీటు, కంఫర్టబుల్ రైడింగ్ అనుభవం ఇస్తుంది.
ఇంతలా ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ కేవలం రూ.59,490కే లభించడం నిజంగా ఓ గోల్డెన్ ఛాన్స్! మీరు ఆలస్యం చేస్తే ఈ ఆఫర్ మిస్ కావచ్చు. త్వరలో బుక్ చేయండి, లేకపోతే చాన్స్ మిస్ అవుతుందనే చెప్పాలి!