
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరోసారి సంచలనంగా మారింది సామ్సంగ్. జూలై 9న జరిగిన స్పెషల్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో, సామ్సంగ్ తన కొత్త ఫోల్డబుల్ ఫోన్లు – గెలాక్సీ Z Fold 7, Z Flip 7 మరియు Flip 7 FEను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త ఫోన్లు ఈ నెల 25 నుంచి అమ్మకానికి వస్తాయి. అయితే ప్రీ బుకింగ్ మాత్రం ఇప్పటికిప్పుడే మొదలైంది. ప్రారంభ ధర ₹89,999 నుంచి ఉండటంతో ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ కల నిజం చేసుకునే సమయం వచ్చింది.
Galaxy Z Fold 7 ఫోన్‌ను ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అన్ని మోడళ్ల కంటే బాగా తేలికగా, పలుచగా డిజైన్ చేశారు. ఇందులో ప్రధాన స్క్రీన్ 8 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. ఇక కవర్ స్క్రీన్ 6.5 అంగుళాలు. ఇది ఈ సారి మరింత వెడల్పుగా 21:9 రేషియోలో తయారైంది. వీడియోలు చూడటానికి, గేమింగ్‌కు ఇది ఓ మస్త్ ఫోన్.
ఈ ఫోన్లో 3nm టెక్నాలజీతో తయారు చేసిన క్వాల్కమ్ Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. దీనితో పాటు 12GB RAM, 256GB నుండి 1TB వరకు స్టోరేజ్ వేరియంట్లు లభిస్తాయి. కెమెరా విషయానికి వస్తే, 200MP ప్రధాన కెమెరాతో పాటు 10MP 3x టెలిఫోటో, 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 10MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇది 8K వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
[news_related_post]ఈ ఫోన్లో 4400mAh బ్యాటరీ ఉంది. ఇది 25W వైర్డ్ చార్జింగ్, 15W వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ యొక్క కొత్త One UI 8 ఆధారంగా రూపొందించిన Android 16 ఉంది. ఇందులో Galaxy AI ఫీచర్లు ఉన్నాయ్. Live Translate, Circle to Search వంటి కొత్త AI టూల్స్ వాడొచ్చు. మీరు మాట్లాడే మాటలను తక్షణమే అనువదించే Live Translate ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది.
Z Flip 7 ఫోన్ క్లోజ్ చేసినప్పుడు పాకెట్లో వేసేలా ఉంటుంది. కానీ ఓపెన్ చేస్తే ఇది 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లేతో వస్తుంది. బయట 4.1 అంగుళాల FlexWindow ఉంది. ఇది ఈసారి మరింత పెద్దది, ఉపయోగకరంగా మార్చారు. ఇందులో Exynos 2500 ప్రాసెసర్ ఉంది. ఇది AI కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు, ముందు భాగంలో 10MP కెమెరా ఉంది. 4300mAh బ్యాటరీ, Android 16, Galaxy AI వంటి అన్ని సదుపాయాలు ఇందులో కూడా ఉన్నాయి.
ఈసారి తొలిసారిగా Flip సిరీస్‌లో Fan Edition కూడా వచ్చింది. Galaxy Z Flip 7 FE అని పిలుస్తున్నారు. ఇది తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో తయారు చేశారు. దీని ప్రైమరీ డిస్ప్లే 6.7 అంగుళాలు, కవర్ డిస్ప్లే 3.4 అంగుళాలు. కెమెరా సెటప్ Flip 7 లాగే ఉంటుంది – 50MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్, ముందు భాగంలో 10MP కెమెరా. ఈ ఫోన్లో Exynos 2400 ప్రాసెసర్, 4000mAh బ్యాటరీ ఉంటుంది.
సామ్సంగ్ ఈ ఫోల్డబుల్ ఫోన్ల ప్రీ బుకింగ్‌ను జూలై 9 నుంచే ప్రారంభించింది. వీటి అమ్మకాలు జూలై 25 నుంచి అధికారికంగా స్టార్ట్ అవుతాయి. Galaxy Z Fold 7 ధర ₹1,74,999 నుంచి ప్రారంభమవుతుంది. Galaxy Z Flip 7 ధర ₹1,09,999 నుంచి మొదలవుతుంది. Galaxy Z Flip 7 FE ఫోన్ కేవలం ₹89,999 నుంచే లభిస్తుంది. అంటే ఇప్పుడు మీరు కూడా ఫోల్డబుల్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌తోనే సొంతం చేసుకోవచ్చు.
ఈ సారి సామ్సంగ్ తీసుకొచ్చిన ఫీచర్లు, డిజైన్, AI టూల్స్ చూసిన తర్వాత ఫోల్డబుల్ ఫోన్ కోసం ఇదే బెస్ట్ టైం అని చెప్పవచ్చు.