
స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంకొన్ని రోజులు ఆగితే బెటర్. ఎందుకంటే ఈ నెల 24న రియల్మీ నుంచి రెండు సరికొత్త ఫోన్లు రానున్నాయి. రియల్మీ 15, రియల్మీ 15 ప్రో పేర్లతో ఈ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ధర తక్కువగానే ఉండబోతుండటంతో, మంచి ఫీచర్లతో ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది మంచి అవకాశంగా మారింది.
ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది బ్యాటరీ మరియు కెమెరా. రియల్మీ 15 సిరీస్‌లో 7000 ఎంఏహెచ్ పవర్ఫుల్ బ్యాటరీ వస్తోంది. ఇది నాన్‌స్టాప్ యూజ్‌కు బాగా సరిపోతుంది. అదేవిధంగా 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది, ఎక్కువసేపు పని చేస్తుంది. నీటిని తట్టుకునే IP69 డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ ఉండటం మరో ప్లస్ పాయింట్.
డిస్ప్లే విషయంలో 6.8 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అంటే మీరు ఎలాంటి కండిషన్‌లోనైనా స్క్రీన్‌ను క్లియర్‌గా చూడవచ్చు. ఈ ఫీచర్లు గేమింగ్, వీడియోలు చూసే వాళ్లకు చాలా ఉపయోగపడతాయి.
[news_related_post]కెమెరా వైపు చూస్తే, సెల్ఫీ లవర్స్‌కు ఇది స్వర్గమే. ఎందుకంటే రెండు ఫోన్లలోనూ 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్మీ 15 ప్రోలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయెల్ రేర్ సెటప్ వస్తోంది. ఇక స్టాండర్డ్ రియల్మీ 15లో 50+8 ఎంపీ రేర్ కెమెరా సెట్ ఉంటుంది. ఫొటోలు అదిరిపోయేలా తీసేందుకు AI MagicGlow 2.0, AI Edit Genie వంటి స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రో వేరియంట్లో Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, సాధారణ మోడల్లో MediaTek Dimensity 7300+ SoC ఉంది. ఫాస్ట్ యూజింగ్, ల్యాగ్ లేకుండా పనులు చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.
ఈ ఫోన్లు ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ పర్పుల్, వెల్వెట్ గ్రీన్ కలర్లలో అందుబాటులోకి రానున్నాయి. రియల్మీ 15 ధర సుమారు రూ. 25,000గా ఉండొచ్చని టాక్, ప్రో వేరియంట్ ధర ₹27,999గా ఉండొచ్చని అంచనా. లాంచ్ రోజున ధరపై పూర్తి క్లారిటీ రానుంది.
ఈ ఫీచర్లు చూస్తే ఈ ఫోన్లు లాంచ్ అయిన వెంటనే ఓవర్ నైట్ సేల్ అయ్యే ఛాన్స్ ఉంది. కనుక, మీరు కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే.. వేయిట్ చేయడం బెటర్.