
విద్య కోసం తపన ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్నాయి అనుకుంటున్నారా? అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. పీఎం యశస్వి యోజన (PM YASASVI Yojana) పేరు వినగానే చాలామందికి ఆశ కలుగుతోంది. ఎందుకంటే ఈ పథకం ద్వారా ప్రభుత్వమే విద్యార్థులకు లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌తో పాటు స్కూల్ లేదా కాలేజ్ ఫీజు పూర్తిగా భరిస్తోంది.
ఈ పథకం ద్వారా రూ.1.25 లక్షల వరకు స్కాలర్షిప్, రూ.2 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇంకా ల్యాప్‌టాప్, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులు ఇలా ఎన్నో లాభాలు లభించనున్నాయి. మీరు చదువులో మంచి మార్కులు సాధిస్తుంటే ఈ పథకం తప్పక మీకు సహాయపడుతుంది. ముఖ్యంగా OBC, EBC, DNT వర్గాలకు చెందినవారు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని OBC (ఇతర వెనుకబడిన వర్గాలు), EBC (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) మరియు DNT (Denotified Nomadic Tribes)కు చెందిన విద్యార్థులకు 9వ తరగతి నుండి పీజీ వరకు చదువు కొనసాగించేందుకు ఆర్థికంగా సహాయం అందుతుంది. ఇది PM Yuva Achievers Scholarship Award Scheme for Vibrant Indiaలో భాగంగా అమలవుతోంది. లక్ష్యం ఒకటే – ప్రతిభ ఉన్న పిల్లలకు మంచి చదువు దొరకాలి.
[news_related_post]ఈ పథకంలో భాగంగా విద్యార్థులు తరగతికి తగిన స్కాలర్షిప్ పొందుతారు. ముఖ్యంగా టాప్ క్లాస్ స్కూల్, కాలేజ్ విద్య కోసం రూ.1.25 లక్షల వరకు స్కాలర్షిప్, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు రూ.2 లక్షల వరకు ఫీజు మాఫీ లభిస్తుంది. పైలట్ ట్రైనింగ్ లాంటి ప్రత్యేక కోర్సులకు రూ.3.72 లక్షల వరకు సహాయం లభిస్తుంది. అలాగే రూ.3,000 ప్రతినెల భోజనం మరియు వసతి ఖర్చులకు, రూ.5,000 పుస్తకాలు, స్టేషనరీకి, ఇంకా రూ.45,000 విలువైన ల్యాప్‌టాప్, ప్రింటర్, యాక్సెసరీస్ కోసం ప్రభుత్వం నేరుగా డబ్బు పంపుతుంది.
దరఖాస్తు చేయడానికి విద్యార్థి భారత పౌరుడు అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. విద్యార్థి OBC/EBC/DNT వర్గానికి చెందినవాడై ఉండాలి. ఇప్పటికే వేరే స్కాలర్షిప్ తీసుకుంటున్నవారైతే దానిని రద్దు చేసుకుని మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంటుంది. ఒకే కోర్సు రెండు సార్లు చేసినవారికి స్కాలర్షిప్ ఉండదు. ఉదాహరణకి, BSc తర్వాత BA చదువుతున్నవారికి ఇది వర్తించదు. ప్రతి కుటుంబం నుండి గరిష్టంగా రెండు మంది పిల్లలు మాత్రమే స్కాలర్షిప్ పొందవచ్చు.
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్: ఇది ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి మరియు అంతకుమించిన విద్యార్థులకు వర్తిస్తుంది. సంవత్సరానికి రూ.4,000 లభిస్తుంది.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్: గ్రూప్ 1: ప్రొఫెషనల్ డిగ్రీలు – రూ.20,000.గ్రూప్ 2: ఇతర డిగ్రీలు – రూ.13,000.గ్రూప్ 3: సాధారణ డిగ్రీలు – రూ.8,000.గ్రూప్ 4: నాన్-డిగ్రీ కోర్సులు – రూ.5,000.
టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్: 9వ, 10వ తరగతులకు రూ.75,000.11వ, 12వ తరగతులకు రూ.1,25,000
టాప్ క్లాస్ కాలేజ్ ఎడ్యుకేషన్:.ప్రైవేట్ కాలేజీలకు ఫుల్ ఫీజు మాఫీ (రూ.2 లక్షల వరకు). పైలట్ ట్రైనింగ్‌కు రూ.3.72 లక్షలు.హాస్టల్, పుస్తకాల ఖర్చులు కూడా
ఈ పథకం కింద వచ్చే మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి ముందే డబ్బు విడతలుగా విడుదల అవుతుంది. విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా దరఖాస్తు చేయాలి. ముందుగా వెబ్‌సైట్‌కి వెళ్లి New Registration సెలెక్ట్ చేయాలి. తరువాత అప్లికేషన్ ID, పాస్వర్డ్ పొందాక లాగిన్ చేసి స్కాలర్షిప్ కోసం ఫారం నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్‌ను స్కూల్ నోడల్ ఆఫీసర్ వెరిఫై చేస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లోనే వెరిఫై చేసి స్కాలర్షిప్ విడుదల చేస్తుంది.
మీరు OBC, EBC లేదా DNT వర్గానికి చెందినవారైతే, ఈ పీఎం యశస్వి యోజనను ఖచ్చితంగా ఉపయోగించుకోండి. చదువుతో పాటు ల్యాప్‌టాప్, హాస్టల్, ఫీజు మాఫీ లాంటి భారీ ప్రయోజనాలు ఈ ఒక్క స్కాలర్‌షిప్‌తో దక్కనున్నాయి. చదువుతో భవిష్యత్ మార్చాలనుకునే ప్రతి విద్యార్థికి ఇది ఒక అమూల్యమైన అవకాశంగా మారుతుంది. తప్పుడు కోర్సులపై డబ్బు ఖర్చుపెట్టకుండా, ప్రభుత్వమే నేరుగా డబ్బు పంపిస్తుందంటే ఇంకేం కావాలి.