
ఇప్పుడు ఆధార్ వాడకం రోజు రోజుకు పెరుగుతుంది. చిన్న పని నుండి పెద్ద అవసరం వరకు ఆధార్ తప్పనిసరి అయ్యింది. కానీ చాలామంది ఇబ్బందిపడే విషయం ఏంటంటే – ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ. ఎక్కడైనా ఫోటోకాపీలు ఇవ్వాలి, మొబైల్ OTP కోసం వెయిట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇది అంతా మారబోతుంది.
కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఉన్న అశ్వినీ వైష్ణవ్ గారు ఇటీవల ఒక సూపర్ అప్డేట్ ప్రకటించారు. కొత్త ఆధార్ మొబైల్ యాప్ త్వరలోనే అందరికి అందుబాటులోకి రాబోతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ ఇప్పుడు యుపీఐ లాగానే సింపుల్‌గా మారనుంది.
ఈ కొత్త ఆధార్ యాప్ ద్వారా ఇప్పుడు మీరు ఆధార్ వెరిఫికేషన్ చేయడానికి ఫోటోకాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హోటళ్లు, ఎయిర్‌పోర్ట్స్ లాంటి ప్రదేశాల్లో ఆధార్ ఫోటోకాపీలు అడగడం ఆగిపోతుంది. దీనివల్ల మీ వ్యక్తిగత డేటా మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ యాప్ Face ID మరియు QR స్కాన్ ద్వారా డిజిటల్ వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తుంది. అంటే మొబైల్ OTP కూడా అవసరం లేదు. ఇదంతా యుపీఐ పేమెంట్ చేసేలా వేగంగా, సురక్షితంగా జరుగుతుంది.
[news_related_post]ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే – ఈ యాప్ మీ అనుమతి లేకుండా ఎలాంటి డేటాను షేర్ చేయదు. అంటే, మీ ఆధార్ డేటా పూర్తిగా మీ ఆధీనంలోనే ఉంటుంది. ఇది డేటా గోప్యత విషయంలో చాలా పెద్ద అడుగు అని చెప్పవచ్చు.
ఇప్పటి వరకు చాలా చోట్ల ఆధార్ కార్డుల ఫోటోలను ఫోటోషాప్ చేసి, డాక్యుమెంట్ మోసాలకు పాల్పడేవారు. కానీ ఈ కొత్త యాప్ వచ్చిన తర్వాత అలాంటి ఫేక్ ఆధార్ ప్రయోగాలు ఇక సాధ్యపడవు. ప్రతి ఆధార్ వెరిఫికేషన్ డిజిటల్‌గా, సెక్యూర్‌గా జరుగుతుంది. దీనివల్ల ఆధార్ ఆధారంగా జరిగే మోసాలకు బ్రేక్ పడుతుంది. మరి ఇదివరకు డిజిటల్ ఆధార్, మాస్క్ ఆధార్ లాంటి సదుపాయాలు ఉన్నాయి కదా! మరో కొత్త యాప్ ఎందుకు అనిపించొచ్చు. నిజంగా చూస్తే, ఆధునిక టెక్నాలజీ రోజుకో అడుగు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం విమాన ప్రయాణాల్లో DigiYatra App వాడకం వల్ల ఆధార్‌తో ప్రయాణం సులభమైంది. కానీ DigiYatra వంటివి ప్రయాణాలకు మాత్రమే పరిమితమయ్యాయి.
కానీ ఈ కొత్త ఆధార్ యాప్ మాత్రం ప్రతి ఒక్కరికి, ప్రతి అవసరానికి ఉపయోగపడేలా డిజైన్ చేయబడుతోంది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగకరంగా మారవచ్చు. ముఖ్యంగా ఒటీపీ వచ్చే లోపలే మొబైల్ నెట్వర్క్ లేకపోవడం, ఆధార్ కాపీ లేని ఇబ్బందులు వంటి వాటిని ఈ యాప్ చెక్ చేయబోతోంది. ప్రస్తుతం ఈ ఆధార్ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. అశ్వినీ వైష్ణవ్ గారి ప్రకారం త్వరలోనే దీని పబ్లిక్ వర్షన్ విడుదల కానుంది. అప్పుడే మనం పూర్తి ఫీచర్లను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు తెలిపిన వివరాలను బట్టి చూస్తే, ఇది ఆధార్ వాడకాన్ని పూర్తిగా మార్చే యాప్ అవుతుందని స్పష్టంగా అనిపిస్తోంది.
ఆధార్ డాక్యుమెంట్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పటి వరకు ఉన్న సమస్యలు – ఫోటోకాపీలు, డేటా లీక్ భయం, OTP టైమింగ్ సమస్యలు ఇవన్నీ చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త ఆధార్ యాప్ అయితే వాటన్నింటికీ పరిష్కారం చూపేలా కనిపిస్తోంది. మీరు కూడా ఈ ఆధార్ యాప్ పబ్లిక్‌కి రాగానే ఉపయోగించడానికి సిద్ధంగా ఉండండి. ఇది మీ ఆధార్ వాడకాన్ని సురక్షితంగా, వేగంగా మార్చేస్తుంది. ఇక ఆధార్ వెరిఫికేషన్ కోసం ఎవరి మీదైనా ఆధారపడాల్సిన పనిలేదు.