
ఒక మంచి ఫోన్ కొనాలంటే చూడాల్సినవి చాలానే ఉంటాయి. డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, లుక్ అన్నీ కలిసే ఒక ఫోన్‌ను పర్ఫెక్ట్గా చేస్తాయి. అయితే ఇవన్నీ ఫీచర్లు ₹31,999 ధరలో వస్తాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. OnePlus ఈ సారి అదే చేసింది. OnePlus Nord 5 పేరుతో వచ్చిన ఈ ఫోన్ గేమర్స్‌కి, ఫుల్ డే యూజర్స్‌కి, ఇంకా ఫ్లాగ్షిప్ ఫీచర్లు బడ్జెట్ ధరలో కావాలనుకునేవారికి చక్కటి ఎంపిక.
ఈ ఫోన్ ధర కేవలం ₹31,999. కాని అందులో మీరు పొందేది మాత్రం ఏ మాత్రం తక్కువ కాదు. OnePlus Nord 5 ఒక ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, గొప్ప కెమెరా, భారీ బ్యాటరీ, స్మార్ట్ ఆక్సిజన్OS వంటి పలు ఫీచర్లతో వస్తోంది. మీరు రోజంతా ఫోన్‌ను ఎక్కువగా వాడినా, గేమింగ్‌కి ఉపయోగించినా, వీడియో చూసినా ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది.
OnePlus Nord 5 ఫోన్ మోడర్న్ డిజైన్‌తో, ఎడ్జెస్ కర్వ్గా ఉండి చేతిలోకి బాగుంటుంది. Marble Sands, Dry Ice, Phantom Grey వంటి రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెంట్. Gorilla Glass 7i ప్రొటెక్షన్‌తో మరింత స్టర్డీగా ఉంటుంది. ఫోన్ తూగే బరువు 211 గ్రాములు. 8.1mm తేలికపాటి బాడీతో దీని లుక్ ఫ్లాగ్షిప్ ఫీలిస్తుంది.
[news_related_post]OnePlus Nord 5లో 6.83 అంగుళాల Swift AMOLED డిస్ప్లే ఉంది. ఇది 1.5K రెసల్యూషన్‌తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 144Hz. అంటే స్క్రోల్ చేయడమో, గేమింగ్‌లో ఫాస్ట్ మోషన్ విజువల్స్ చూసినా ఎంత స్మూత్‌గా ఉండే ఫీల్ ఇస్తుందో చెప్పలేం. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. డిస్ప్లేకి గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది.
ఈ ఫోన్లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇందులో LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. దీని వల్ల మీరు ఒకేసారి ఎన్నో యాప్స్ ఓపెన్ చేసినా, గేమ్స్ ఆడినా ల్యాగ్ అనిపించదు. BGMI, COD: Mobile వంటి గేమ్స్‌ను 144 FPS వరకు ప్లే చేయొచ్చు. వెపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో ఫోన్ వేడెక్కకుండా పనిచేస్తుంది. ఇది ఒక మిడ్‌రేంజ్ ఫోన్‌కి పెద్ద ప్లస్ పాయింట్.
OnePlus Nord 5లో 50MP Sony LYT-700 మెయిన్ కెమెరా ఉంది. దీనికి OIS కూడా ఉంది. పక్కగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఇచ్చారు. ఇది ఆటోఫోకస్‌తో వస్తుంది. నోటీసుబుల్గా డే టైమ్ ఫొటోలు, వీడియోలు బాగుంటాయి. సెల్ఫీలు చాలా క్లీన్‌గా, డీటెయిల్డ్‌గా ఉంటాయి. నైట్ మోడ్ లో కెమెరా పర్ఫెక్ట్ కాదు కానీ ఆవరేజ్‌గా డెలివర్ చేస్తుంది.
ఈ ఫోన్లో 6800mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది యూరప్ వెర్షన్లో 5200mAh ఉండగా మన భారతీయ వెర్షన్లో 800mAh ఎక్కువగా ఉంది. 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ తో కేవలం 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. హేవీ యూజర్స్‌కి ఇది వన్ డే బ్యాటరీ అనుభూతి ఇస్తుంది. అలాగే ఇది reverse charging ఫీచర్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది.
OnePlus Nord 5 లో Android 15 ఆధారిత OxygenOS 15 ఉంది. ఇది క్లీన్, స్మార్ట్, ఇంటెలిజెంట్ అనుభూతిని ఇస్తుంది. Plus Key Shortcuts, Real-time Translation, AI Search వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ జెమినీ AI కోసం మూడు నెలల ట్రయల్ కూడా లభిస్తుంది. కొందరికి ఫీచర్లు ఎక్కువగా అనిపించొచ్చు కానీ రోజూ వాడే వారికి ఇది బెస్ట్ అనిపిస్తుంది.
బీటా యూజర్ల ప్రకారం ఈ ఫోన్‌ను ట్రై చేసిన వాళ్లు ఇలా చెబుతున్నారు. “మెయిన్, సెల్ఫీ కెమెరా అద్భుతంగా పనిచేస్తున్నాయి.” “ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడితే రెండు రోజులు ఫోన్ వాడచ్చు.” “డిస్ప్లే క్వాలిటీ, సాఫ్ట్వేర్ ఫీచర్లు ఎక్స్లెంట్.” ₹31,999కి ఈ రేంజ్లో అటువంటి ఫోన్ వెతికినా దొరకదు. OnePlus Nord 5 ఫోన్‌ను ఇప్పుడే బుక్ చేయండి.