
ప్రస్తుతం ప్రభుత్వ రంగాల్లో అనుభవం రావాలనుకుంటున్నవారికి ఒక అద్భుతమైన అవకాశం లభించింది. “స్వచ్ఛ భారత్ మిషన్” కింద ఇంటర్న్‌షిప్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి నగర్ పాళిక అందిస్తున్న అఫీషియల్ ఇంటర్న్‌షిప్. పూర్తిగా ప్రభుత్వ పరంగా ఉండటంతో దీనికి ఉన్న విశ్వసనీయత కూడా ఎక్కువ. రెండు నెలల పాటు ఈ ఇంటర్న్‌షిప్ జరుగుతుంది. మీ దగ్గర మినిమం సమయం ఉంటే మరియు సొంతంగా పని చేసే ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయాలి. ఆలస్యం చేస్తే అవకాశం మిస్సవచ్చు.
ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనేవారికి నెలకు రూ.5,000 స్టైపెండ్ కూడా లభిస్తుంది. అంటే మీరు పని చేయడమే కాకుండా, కొంతమేర ఆదాయం కూడా పొందవచ్చు. ఇది మొదటిసారి ఇంటర్న్‌షిప్ చేస్తున్నవారికి చాలా మంచి అవకాశం. మీరు విద్యార్ధి అయినా, చదువు పూర్తయిన తర్వాత పని కోసం చూస్తున్నా సరే, ఈ ఇంటర్న్‌షిప్ మీకు అనుభవాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో పనిచేసే అనుభవం మీరు రిజ్యూమేలో చేర్చుకున్నప్పుడు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశముంది.
ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మీరు శుభ్రతపై పని చేస్తారు. నగర పరిసరాల్లో శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అవగాహన కార్యక్రమాలు, రిపోర్టులు తయారుచేయడం, ఫొటోలు, వీడియోలు తీయడం వంటి పనులు ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఉంటాయి. అంటే మీరు క్రియేటివ్‌గా ఆలోచించగలగాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉండటం కూడా కొంత వరకు ఉపయోగపడుతుంది.
[news_related_post]ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేసేందుకు చివరి తేదీ జూలై 15. అంటే మీ దగ్గర కేవలం కొన్ని రోజులే ఉన్నాయి. మరి ఆలస్యం చేయకండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీరు ప్రభుత్వ రంగంలో మంచి అనుభవాన్ని పొందొచ్చు. ఇది మీ కెరీర్‌కి స్టార్ట్ ఇవ్వడానికి ఒక బలమైన మెట్టిలా పనిచేస్తుంది.
స్వచ్ఛ భారత్ ఒక గౌరవప్రదమైన మిషన్. ఇందులో మీరు పని చేయడం అంటే దేశసేవలో భాగమవడం అనే భావన కలిగిస్తుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని ఈరోజే చేజిక్కించుకోండి. Apply చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి అవకాశం ప్రతిసారీ రాదు.