
Samsung బ్రాండ్ అంటేనే ఫ్లాగ్షిప్ మార్కెట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది. తాజాగా వచ్చే Galaxy S26 Ultra ఫోన్ పై లీకులు వైరల్ అవుతున్నాయి. ఇది 2026 జనవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే దీనిలో ఉండబోయే కొత్త కెమెరా, ప్రాసెసర్, డిస్ప్లే ఫీచర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చకెక్కాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సారి Samsung తన ISOCELL కెమెరా సెన్సార్‌ను వదిలేసి కొత్తగా Sony sensor వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇది చాలా గొప్ప మార్పు అనే చెప్పాలి.
ఇప్పటి వరకు Samsung తన Ultra సిరీస్ ఫోన్లలో ISOCELL సెన్సార్లనే వాడింది. కానీ ఈసారి, Galaxy S26 Ultraలో 1/1.1-ఇంచ్ సైజ్ ఉన్న 200 మెగాపిక్సెల్ Sony CMOS సెన్సార్‌ను తీసుకురానున్నట్టు చైనీస్ టిప్‌స్టర్ Fixed Focus Digital లీక్ చేశారు. ఇది గమనించదగిన విషయం ఎందుకంటే, గత Galaxy S25 Ultraలో 1/1.3-ఇంచ్ ISOCELL కెమెరా ఉండేది. ఇప్పుడు Sony sensorకు మారడం వల్ల లైట్ క్యాప్చర్ చేయగల సామర్థ్యం మరింత మెరుగవుతుంది. అంటే ఫోటోలు, వీడియోలు ముందు కన్నా చాలా క్లారిటీగా, డిటెయిల్డ్గా వచ్చే అవకాశం ఉంది.
Samsung ఫోన్లకు కెమెరా అప్డేట్స్ అనేవి సాధారణమే. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్, ఈ Ultra సిరీస్ ఫోన్‌కు Sony sensor ఇవ్వడం వల్ల Imaging Strategy పూర్తిగా మారినట్టు తెలుస్తోంది. అంటే Samsung బ్రాండ్ కచ్చితంగా ఫోటో క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులోని ముఖ్యాంశం ఏంటంటే – Apple, Google వంటి కెమెరా గ్రేట్ బ్రాండ్స్‌తో పోటీకి దిగడానికి ఇది ఒక పెద్ద అడుగు అవుతుంది.
[news_related_post]200MP Sony sensor ఒక్కడే కాదు – S26 Ultra ఫోన్ మొత్తం కెమెరా సెటప్‌లో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇందులో 50MP ultra-wide కెమెరా, 12MP 3x టెలిఫోటో లెన్స్, 50MP 5x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉండబోతున్నాయి. అంటే నాలుగు కెమెరాలు ఒక్కో యాంగిల్‌కు ప్రత్యేకంగా పనిచేస్తాయి. వీటన్నింటినీ హ్యాండిల్ చేయడానికి Samsung కొత్తగా “ProVisual Engine” అనే కొత్త ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని తీసుకురానుంది. దీని వల్ల డైనమిక్ రేంజ్, కలర్ కరెక్ట్‌నెస్ చాలా హై లెవెల్లో ఉండబోతున్నాయి.
కేవలం కెమెరాతో కాకుండా, ఈ ఫోన్లో ప్రాసెసర్ కూడా బాగా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. దీనిలో yet-to-be-announced “Snapdragon 8 Elite Gen 2” చిప్ ఉపయోగించనున్నారని లీక్ సమాచారం. ఇది సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో 16GB RAM కూడా ఉండబోతోంది. అంటే గేమింగ్, మల్టిటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి హేవీ యాప్స్ కోసం ఇది beast ఫోన్ అవుతుంది.
Galaxy S25 Ultraలో ఉన్న 6.9-ఇంచ్ స్క్రీన్‌ను S26 Ultra కూడా కొనసాగించనుంది. కానీ ఈసారి bezels మరింత సన్నగా చేసి immersive look అందించబోతున్నారు. అంటే మొబైల్ స్క్రీన్‌ను సినిమాటిక్ లెవెల్లో చూసే అవకాశం ఉంటుంది. ఈ AMOLED స్క్రీన్ HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్‌తో మార్కెట్లో బెస్ట్ లెవెల్ డిస్ప్లే అవుతుంది.
Samsung Galaxy S26 సిరీస్‌ను 2026 జనవరిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇందులో Galaxy S26, Galaxy S26 Edge ఫోన్లు కూడా రావొచ్చు. కానీ ఈసారి Galaxy Plus మోడల్‌ను తొలగించనున్నట్టు సమాచారం. అంటే సింపుల్ గా మూడు వేరియంట్స్ మాత్రమే ఉండేలా మార్పు చేయబోతున్నారు.
Galaxy S26 Ultra ధర ₹1.25 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది తక్కువ ధర కాదు. కానీ ఇందులో వచ్చే కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ వంటి అంశాలను చూస్తే, ఇది పూర్తిగా ఫ్యూచర్ రెడీ డివైస్. మనం ఒకసారి డబ్బు పెట్టినా, అప్‌గ్రేడ్ అవసరం లేకుండా మూడేళ్లు టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.
Galaxy S26 Ultra లీకులు చూస్తేనే goosebumps వచ్చేస్తున్నాయి. ఇది కేవలం Samsungకు కాకుండా, మొత్తం స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి న్యూ బెంచ్‌మార్క్ అవుతుంది. మీరు ఫోటోగ్రఫీ పేషనేట్ అయితే, హైపర్ఫాస్ట్ మొబైల్ కావాలంటే – ఈ beast ఫోన్‌కు ఎదురే ఉండదు. ఇప్పుడు నుంచే మీ Budget ప్లాన్ చేసుకోండి – ఎందుకంటే 2026 జనవరి వస్తోందంటే Samsung Galaxy S26 Ultraతో వేరే లెవెల్ లోని ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయబోతుంది…