
మీకో పవర్ఫుల్ ఫోన్ కావాలా? ఆటల కోసం గేమింగ్ beast, సినిమాల కోసం బ్రైటు డిస్ప్లే, సెల్ఫీల కోసం అదిరిపోయే కెమెరా – ఇవన్నీ ఒకే ఫోన్లో కావాలనుకుంటే iQOO Neo 10R 5G ఫోన్ మీద మీ దృష్టి ఉండాలి. ఈ ఫోన్ మోడర్న్ లుక్స్‌తో మాత్రమే కాదు, అత్యాధునిక ఫీచర్లతోనూ వస్తోంది. అదనంగా అమెజాన్‌లో ఇప్పుడు దీని మీద మంచి డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్ కూడా ఉన్నాయి.
ప్రస్తుత ధర కేవలం రూ.27,998. అసలు ధర రూ.33,999గా ఉండగా, ఇప్పుడు 18% తగ్గింపు లభిస్తోంది. అంటే మీరు దాదాపు రూ.6,000 పొదుపు చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని కొనకపోతే మళ్లీ ఇంత డీలొరలేదు అన్నమాట.
iQOO Neo 10R 5G లో Snapdragon 8s Gen 3 చిప్సెట్ ఉంది. ఇది 3GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి భారీ పనులు చాలా స్మూత్‌గా సాగిపోతాయి. ఈ ఫోన్లో 8GB RAM తో పాటు 8GB వరకూ వర్చువల్ RAM కూడా ఉంటుంది. అంటే మొత్తం 16GB లాంటి అనుభవం. యాప్స్ ఓపెన్ చేయడం, గేమ్స్ ఆడడం – ఏదైనా పనితీరులో ఏ మాత్రం తగ్గిపోదు. స్టోరేజ్ విషయానికి వస్తే, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. కానీ మెమరీ కార్డ్ స్పేస్ లేదు, కాబట్టి మొబైల్ కొనేటప్పుడు మోడల్ ఎంపిక చక్కగా చేసుకోవాలి.
[news_related_post]iQOO Neo 10R 5G లో 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ 1260×2800 పిక్సెల్స్. ఇది 1.5K క్లారిటీ ఇస్తుంది. స్క్రీన్ బ్రైట్నెస్ ఏకంగా 4500 నిట్స్ వరకూ ఉంటుంది. అంటే ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144Hz. ఇది గేమింగ్‌కు చాలా ఉపయోగపడుతుంది. టచ్ సాంప్లింగ్ రేట్ 2000Hz అంటే, చాలా వేగంగా టచ్‌కు స్పందిస్తుంది. గేమర్లు, వీడియో లవర్స్ కోసం ఇది ఫుల్ మజా. డిస్ప్లేను DT-Star2 Plus గ్లాస్ కవర్ చేస్తోంది. అంటే తట్టుకోలేని క్లారిటీకి తగినంత ప్రొటెక్షన్ కూడా ఉంది.
ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6400mAh. అంటే మీరు రోజంతా ఎక్కువగా ఉపయోగించినా చార్జింగ్ తగ్గదు. ఇంకా ఇందులో 80W ఫ్లాష్ చార్జ్ ఉంది. కొన్ని నిమిషాల్లోనే ఫోన్ 50% వరకూ ఛార్జ్ అవుతుంది. అలాగే 7.5W రివర్స్ చార్జింగ్ కూడా ఉంది. అంటే మీ ఫోన్‌తో ఇంకొక డివైస్‌ను ఛార్జ్ చేయచ్చు. దీన్ని బ్యాటరీ బీస్ట్ అని పిలవడంలో సందేహం లేదు.
ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి OIS సపోర్ట్ ఉంది. అంటే షేకింగ్ లేకుండా స్పష్టమైన ఫోటోలు వస్తాయి. సెకండరీ 8MP కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్‌ను వాడుతుంది. రాత్రిపూటలోనూ, పోర్ట్రెయిట్ మోడ్‌లోనూ ఫోటోలు బాగా వస్తాయి. వీడియోలు 4K లో 60fps వరకు రికార్డ్ చేయొచ్చు. కంటెంట్ క్రియేటర్లకు ఇది బెస్ట్ ఫోన్.
iQOO Neo 10R 5G అసలు ధర రూ.33,999. కానీ ఇప్పుడు రూ.27,998కే లభిస్తోంది. అంటే రూ.6,000 తగ్గింపు. Moonknight Titanium కలర్, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇది. అమెజాన్‌లో లిమిటెడ్ టైం ఆఫర్ ఇది.
SBI క్రెడిట్ కార్డు ఉన్న ప్రైమ్ మెంబర్స్‌కు రూ.500 అదనపు తగ్గింపు ఉంది. ICICI అమెజాన్ పే క్రెడిట్ కార్డు వాడితే 5% క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. EMI ప్లాన్లు నెలకు కేవలం ₹1,357 నుండి మొదలవుతాయి. నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్ బాగుంటే ఎక్స్చేంజ్ మీద కూడా ధర తగ్గించుకోవచ్చు. అదనంగా ₹500 కూపన్ కూడా వాడొచ్చు. బిజినెస్ కస్టమర్లకు GST బిల్లు మీద 28% వరకూ సేవింగ్స్ చేసే అవకాశం ఉంటుంది.
iQOO Neo 10R 5G అంటే ఫుల్ స్పీడ్, ఫుల్ స్టైల్, ఫుల్ కెమెరా, ఫుల్ బ్యాటరీ. ఇలా అన్ని విషయంలోనూ అగ్రస్థానంలో ఉంటుంది. మీరు గేమింగ్ ప్రేమికులైనా, వీడియోల కోసం మొబైల్ చూస్తున్నా, లేదా కెమెరా ప్రధానంగా చూస్తున్నా – ఈ ఫోన్ నిరాశ పరచదు. ఇప్పుడే కొనకపోతే మళ్లీ ఇంత తగ్గింపు రావడం కష్టం. మీరు వేచి చూసిన ఫోన్ ఇదే కావచ్చు.