
Redmi మళ్లీ తన మ్యాజిక్ చూపించింది. ఇప్పుడు 5G ఫోన్‌ను చాలా తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సారి Redmi 13 5G అనే బడ్జెట్ బుల్లెట్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రీమియం లుక్, పవర్ఫుల్ ఫీచర్లు, భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, అంతేకాదు 108MP కెమెరాతోన వస్తోంది. అంతా చూస్తే ఇది రూ.20 వేల ఫోన్ లాగా అనిపిస్తుంది. కానీ అసలు ధర కేవలం రూ.11,749 మాత్రమే. ఇలాంటి ధరలో ఇలాంటి ఫీచర్లతో ఫోన్ రావడం చాలా అరుదు.
Redmi 13 5G లో Qualcomm Snapdragon 4 Gen 2 AE చిప్సెట్ ఉంది. ఇది 5G పనితీరుకి స్పెషల్ గా తయారైన ప్రాసెసర్. ఇందులో 2.3GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్డా కోర్ సెట్అప్ ఉంది. అంటే డే టూ డే యూజ్, యాప్స్ మధ్య స్పీడ్‌గా స్విచ్ అవడం, మల్టీటాస్కింగ్ – అన్నీ చాలా స్మూత్‌గా జరుగుతాయి. దీని RAM కూడా అదుర్స్ – 6GB ఫిజికల్ RAMతో పాటు 6GB వరకూ వర్చువల్ RAM కూడా అందుతుంది. మొత్తం మీద 12GB RAM అనిపించే ఈ ఫోన్, మీరు ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినా ల్యాగ్ కాకుండా పనితీరు ఇస్తుంది.
ఈ ఫోన్లో 6.79 ఇంచ్ భారీ స్క్రీన్ ఉంటుంది. ఇది IPS ప్యానెల్‌తో వస్తోంది. దీని రిజల్యూషన్ 1080×2460 పిక్సెల్స్. స్క్రోలింగ్ చాలా సిల్కీగా అనిపిస్తుంది. దీనికి కారణం 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్. అంటే యాప్ బేస్డ్గా అది మారుతూ పనిచేస్తుంది. ఫోన్ ముందు భాగాన్ని గోరిళ్లా గ్లాస్ కవర్ చేస్తుంది. TÜV Rheinland సర్టిఫికేషన్ ఉండటం వల్ల దీని వల్ల కంటికి ఎక్కువ ఒత్తిడి ఉండదు. నీటి బొట్టులు స్క్రీన్‌పై ఉన్నా ఫోన్ రిస్పాండ్ అవుతుంది. ఇది నిజంగా ఉపయోగపడే ఫీచర్.
[news_related_post]Redmi 13 5Gలో 5030mAh బ్యాటరీ ఉంటుంది. ఇది నార్మల్ యూజ్‌తో 1.5 రోజులు సులభంగా నడుస్తుంది. మీరు ఎక్కువగా వీడియోలు చూస్తున్నా, సోషల్ మీడియా యూజ్ చేస్తున్నా డే బ్యాటరీ డ్రైన్ కాకుండా జాగ్రత్త పడుతుంది. ఇక ఛార్జింగ్ విషయంలో 33W ఫాస్ట్ చార్జింగ్ ఉంది. తక్కువ టైంలో ఫోన్‌ను మళ్లీ ఉపయోగించుకునేలా చేస్తుంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ – రెండు కలిపితే ఇది పర్ఫెక్ట్ డెవైస్.
ఈ ధరలో 108MP కెమెరా? అవును. Redmi 13 5G మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇస్తోంది. దీని సహాయంతో డే లైట్ ఫోటోలు చాలా డీటెయిల్డ్‌గా వస్తాయి. మాక్రో లెన్స్ కూడా ఉంది. అయితే రాత్రిపూట ఫోటోలు సగం సంతృప్తి కలిగించేలా ఉంటాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. వీడియో కాలింగ్, సోషల్ మీడియా ఫోటోలకు ఇది చాలిపోతుంది. వీడియోలు 1080p లో 30fps వరకు రికార్డు చేయొచ్చు. మొత్తం మీద కెమెరా పనితీరు సాధారణ వినియోగదారులకు చాలినంత ఉంటుంది.
ఫోన్ ప్రారంభ ధర రూ.17,999గా ప్రకటించబడింది. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో కేవలం రూ.11,749కే లభిస్తోంది. అంటే రూ.6,250 తగ్గింపు. ఇది దాదాపు 35% ధర తగ్గింపు. EMIతో కొనాలనుకున్నవారికి కూడా మంచి అవకాశాలున్నాయి. నెలకు కేవలం ₹570 EMIతో ఫోన్‌ను తీసుకోవచ్చు. No-cost EMI కూడా ఉంది. అంటే ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా కూడా మీకు ఈ ఫోన్ వచ్చేస్తుంది.
Amazon Pay ICICI క్రెడిట్ కార్డు ఉంటే, అదనంగా రూ.352 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాదు, కొన్ని బ్యాంక్ EMI ఆఫర్లపై ₹746 వరకూ వడ్డీ సేవింగ్ కూడా ఉంటుంది. బిజినెస్ కస్టమర్లకు GST బిల్లింగ్ ద్వారా 28% వరకూ సేవింగ్స్ చేసే అవకాశం ఉంటుంది.
Redmi 13 5G నిజంగా బడ్జెట్ సెగ్మెంట్లో బెస్ట్ డీల్ అనిపించే ఫోన్. మీరు రోజువారీ వాడకానికి, 5G స్పీడ్‌తో పాటు పెద్ద స్క్రీన్, మంచి బ్యాటరీ, కెమెరా చూస్తే ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఎక్కువ ఖర్చు లేకుండా ఓ హై-ఎండ్ అనుభవం కోరుకునే వారికి ఇది బెస్ట్ మొబైల్. మరి ఆలస్యం ఎందుకు? ఆఫర్ ఉండగా మీ ఫోన్‌ను ఫాస్ట్‌గా ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఈ రేంజ్లో మళ్లీ ఇలాంటిదీ రావడం కష్టం…