
గుంటూరు మీదుగా చెర్లపల్లి, కాకినాడ టౌన్, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్ – చెర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుండి మార్చి 28, 2026 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది. (07448) చెర్లపల్లి – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు జూలై 6 నుండి మార్చి 29 వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది.
(07445) కాకినాడ టౌన్ – లింగంపల్లి స్పెషల్ రైలు జూలై 2 నుండి మార్చి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. (07446) లింగంపల్లి – కాకినాడ టౌన్ స్పెషల్ రైలు జూలై 3 నుండి మార్చి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుందని సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు.