- అధికారుల నిరంతర పర్యవేక్షణ వారానికి ఒక రోజు పాఠశాలను సందర్శించనున్న అధికారులు
- విద్యార్థులు పరీక్షలు రాసేందుకు బుక్లెట్.. కరెక్షన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలన
- క్వాలిటీ ఎడ్యుకేషన్పై దృష్టి సారించాలని ఎంఈవో, డీవైఈవోలకు ఆదేశాలు
- రానున్న విద్యాసంవత్సరం నుంచే అధికారులు నిత్యం మానిటరింగ్
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుక స అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఇప్పటికే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి తీసుకొచ్చారు. బడులు తెరిచేలోపే అన్ని పనులు పూర్తి చేయనున్నారు. ఇక వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి పాఠశాలపై నిత్యం ఫోకస్ ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధి కారులు ఇటీవల స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, కాలక్షేపం కోసం పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. ఉపాధ్యాయులు కోరుకున్న విధంగా విధంగా బదిలీలు, ఇతర ప్రక్రియ చేపడుతున్నామని, దానికి అనుగుణంగా నిబద్దతతో విధులు నిర్వర్తించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అధికారులు సూచించారు.
ఈ ఏడాది నుంచే ప్రతి విద్యార్థికి బుక్లెట్..
గతంలో జిల్లా కేంద్రాల నుంచి విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు మాత్రమే పాఠశాలలకు వచ్చేవి. విద్యార్థులు ఏ4 షీట్లలో జవాబులు రాసేవారు. అయితే.. ఈ ఏడాది నుంచి ప్రశ్నాపత్రాలతోపాటు జవాబులు రాసేందుకు ఓ బుక్లెట్ను పంపనున్నారు. ఆ బుక్లెట్లోనే ప్రతి విద్యార్థి అన్ని పరీక్షలను రాయాల్సి ఉంటు ందని అధికారులు స్పష్టం చేశారు. బుక్లెట్ ఒక్క విద్యార్థికి ఒక్కసారి మాత్రమే ఇస్తామని, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని, పోతే మళ్లీ ఇవ్వమని చెబుతు న్నారు. బుక్ లెట్ విధానం లేకపోవడం వల్ల గతంలో టీచర్లు ఒక్కో పరీక్షను ఒక్కో విద్యార్థితో రాయించిన ఘటనలు కూడా ఉన్నాయని ఇలాంటి వాటిని నివారించేం దుకు నూతన విధానం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్లెట్లోనే జవాబులు రాయడం వల్ల అక్కడే ఉపాధ్యా యులు కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. తద్వారా కరెక్షన్స్ ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అధికారులు ఇకపై క్షుణ్ణంగా పరిశీలించ నున్నారు. బుక్లెట్ విధానం వల్ల విద్యార్థి ఏ పరీక్షను గైర్హాజరు కాకుండా ఉపాధ్యాయుడు పర్యవేక్షించే పరిస్థితి ఉంటుంది.
వారంలో ఒక రోజు పాఠశాల సందర్శన..
ఇకపై ప్రతి ప్రభుత్వ పాఠశాలను వారంలో ఒకరోజు జిల్లాలోని ఎంఈవోలు, డీవైఈవోలు, డీఈవోలు ఇతర అధికారులు సందర్శించనున్నారు. పాఠశాలలోని రికార్డుల నిర్వహణ, బోధన, విద్యార్థుల సామర్థ్యాలు తదితర వివరాలను అధికారులు తెలుసుకోనున్నారు. దీంతోపాటు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతోనే అధికారుల పాఠశాలల సందర్శన కార్యక్రమం ఉంటుందని ఉన్నతాధి కారులు స్పష్టం చేశారు. గతంలో మాదిరి ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టేవిధంగా ఉండవని, అలాగని నిర్లక్ష్యంగా ఉంటే సహించమని తెలిపారు. ప్రతి పాఠశాలపై నిత్యం మానిటరింగ్ ఉంటుందని అన్నారు.
హెచ్ఎంలకు ఫుల్ పవర్స్
ఒకేచోట ఉంటే పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను హైస్కూల్ ప్రధానోపాధ్యా యులే చూడనున్నారు. మోడల్ ప్రైమరీ బాధ్యతలను స్కూల్ అసిస్టెంట్లకు కేటాయిం చను న్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. ఈ ఏడాది వరకు హైస్కూల్ ప్లస్లలో ఉన్న ఇంటర్ తరగతులు కొనసాగించి, భవిష్యత్తులో వాటిని ఇంటర్ బోర్డుకు అప్ప గించే అవకాశం ఉంది. దీంతోపాటు ఎలాంటి డీవియేషన్స్ లేకుండా.. పాఠశాలలో విద్యపైనే ఉపాధ్యాయుడి దృష్టి ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు