IPL:హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగకపోవడానికి అసలు కారణం ఇదేనా..?

మే 17 నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభమవుతుందని బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మే 8న ఐపీఎల్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు, టోర్నమెంట్ నిర్వాహకులతో విస్తృతంగా చర్చించిన తర్వాత, టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం, కొత్త షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఐపీఎల్ 2025లో జరగనున్న 17 మ్యాచ్‌లు దేశంలోని 6 ప్రధాన నగరాల్లో జరుగుతాయి. దీనిలో భాగంగా, మే 17న బెంగళూరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య మ్యాచ్‌తో టోర్నమెంట్ తిరిగి ప్రారంభమవుతుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. లీగ్ దశ మే 27న ముగుస్తుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లు మే 29న, ఎలిమినేటర్ మే 30న, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు జూన్ 1న జరుగుతాయి. చివరగా, ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.

తాజా షెడ్యూల్‌లో, మునుపటి షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్‌లో జరగాల్సిన రెండు కీలక మ్యాచ్‌లు, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌లను BCCI తొలగించింది. దీనికి ప్రధాన కారణం, హైదరాబాద్ నగరం ప్రస్తుతం “రెడ్ జోన్” కింద ఉన్నందున పూర్తి భద్రతా హామీలు ఇవ్వలేమని BCCI అభిప్రాయపడటంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

అంతేకాకుండా, హైదరాబాద్‌లో జరగాల్సిన ఒక లీగ్ మ్యాచ్‌ను కూడా ఢిల్లీకి తరలించారు. ఇది హైదరాబాద్ అభిమానులలో తీవ్ర నిరాశకు గురిచేసింది. మిగిలిన మ్యాచ్‌లు బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, ముంబై వేదికలలో కొనసాగుతాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌ల ఖచ్చితమైన వేదికలను కూడా త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

హైదరాబాద్‌లో మ్యాచ్‌లు రద్దు కావడంపై స్థానిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనకపోవడం పట్ల తమ నగరం తీవ్ర విచారంలో ఉందని వారు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం ఈవెంట్‌కు అవసరమైన భద్రత కల్పించలేకపోవడంతో హైదరాబాద్‌ను మ్యాచ్‌ల నుండి మినహాయించినట్లు తెలుస్తోంది.