AP 10th Supplimentary Exams: మరో వారంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల వచ్చేశాయ్..

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ ఇటీవల హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా మనమిత్ర వాట్సాప్ 95523 00009 నుండి నేరుగా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

విద్యార్థులు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ లేదా ప్రధానోపాధ్యాయుడి నుండి కూడా హాల్ టిక్కెట్లను పొందవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుని వీటిని పొందవచ్చు. మే 19 నుండి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఆ రోజుల్లో ఈ పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుండి 30 వరకు జరిగిన విషయం తెలిసిందే.

ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 81.14 శాతం. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి నారా లోకేష్ ఫలితాల విడుదల సందర్భంగా తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణతతో ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

Related News

2025 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పూర్తి టైమ్ టేబుల్ ఇది..

మే 19న మొదటి భాషా పేపర్ 1
మే 20న రెండవ భాష
మే 20న ఇంగ్లీష్
మే 21న గణితం
మే 22న భౌతిక శాస్త్రం
మే 23న జీవశాస్త్రం
మే 24న సామాజిక శాస్త్రం
మే 26న సామాజిక శాస్త్రం
మే 27న మొదటి భాషా పేపర్ 2, OSSC ప్రధాన భాషా పేపర్ I
OSSC ప్రధాన భాషా పేపర్ 2, SSC ఒకేషనల్ కోర్సు