India-Pakistan: ఇండియా-పాకిస్తాన్ యుద్ధం.. హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై బ్యాన్!!

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ ఆపరేషన్ తర్వాత, పాకిస్తాన్ భారతదేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేస్తోంది. ఇప్పటికే భారతదేశంలోని సరిహద్దు నగరాల్లో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన పాకిస్తాన్, దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లబడే వరకు హైదరాబాద్ నగరంలో బాణసంచా పేల్చడాన్ని నిషేధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నగరంలో బాణసంచా పేల్చడం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. పేలుళ్ల సమయంలో వచ్చే శబ్దాల మాదిరిగానే బాణసంచా పేలుళ్ల శబ్దాలు కూడా ఉండటం వల్ల, అవి ప్రజల్లో ఆందోళనకు దారితీయవచ్చని ఆయన భావించారు. ప్రజల్లో భయాందోళనలను తొలగించి, శాంతిభద్రతలను కాపాడాలనే లక్ష్యంతో సీపీ సీవీ ఆనంద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

అయితే, ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని సివి ఆనంద్ అన్నారు. పాకిస్తాన్, భారతదేశం మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆంక్షలను ఉల్లంఘించి, బాణసంచా పేల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఈ నిషేధాన్ని అందరూ పాటించాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.