ఏపీ (ఆంధ్రప్రదేశ్) సీఎం చంద్రబాబు ఈరోజు (శుక్రవారం) అనంతపురం జిల్లాను సందర్శించారు. అనంతపురం హంద్రీ నీవా పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఎవరూ చదువుకోలేకుండా ఉండకూడదని అన్నారు. పేదరికం కారణంగా చాలా మంది యువత చదువుకు దూరంగా ఉంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పేదలు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని, వారికి అండగా నిలుస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Related News
ఈ క్రమంలో యువ జంటలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. యువ జంటలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. పెద్ద కుటుంబాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. అలాగే, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.