రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు అంచెల పాఠశాల విధానం స్థానంలో ఇకపై తొమ్మిది రకాల బడులు రానున్నాయి. స్కూల్ అసిస్టెంట్ల బోదన వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6-10 తరగతులకు మాత్రమే పరిమితం కానుంది. ఈ మేరకు మార్పు లతో ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శ కాలు విడుదల చేయనున్నట్టు తెలిసింది.
గత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పరిశీ లనలు, ప్రయోగాలు చేసి, ఐదు నెలల క్రితం జీవో 117 ఉపసంహరణ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందీ ఇందులో ఐదు రకాల పాఠశా లలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అయితే తాజాగా అవి తొమ్మిది రకాలకు పెంచారని సమాచారం. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లోని 3-5 తరగతులను వెనక్కి తెచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లు (MPS) ఏర్పాటు చేయాలనుకు అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు.
Related News
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలపై ఒత్తిడి తెచ్చి స్కూళ్లను విలీనం చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల స్కూళ్లను మాతమే గుర్తించ గలిగారు. మరోపక్క హైస్కూల్ ప్లస్లను రద్దు చేస్తామని తీవ్రంగా ప్రయత్నించగా ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం తో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్టు ప్రక టించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 300 ఉన్నత పాఠశా లల్లో 3-5 తరగతులను అక్కడే ఉంచి 1, 2 తర గతులు అదే పాఠశాలలకు చేర్చనున్నారు. ఇదే స్కూల్లో 1-5 తరగతులకు ప్రత్యేక ప్రైమరీ విభాగం ఏర్పాటు చేస్తారు. ఈ తరగతులకు ఒకరు లేదా ఇద్దరు SGT ను ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. అంటే 3-5 తరగతులు హైస్కూల్లో ఉన్నా, సబ్జెక్టు టీచర్ల బోధన రద్దు చేశారు.
ప్రస్తుతం ఉన్న హైస్కూల్ ప్లస్ ఉపసంహరణ పైనా విద్యాశాఖ వెనక్కి తగ్గింది. 294 బాలికల హైసూ స్థల్ ప్లస్ పాఠశాలలను కొనసాగించనున్నారు.. కో- ఎడ్యుకేషన్ కింద ఉన్న 210 హైస్కూల్ ప్లస్లను ఇంటర్మీడియట్ విభాగానికి అప్పచెబు తామని చెబుతున్నా పూర్తి స్థాయి విధివిధానాలను వెల్లడించలేదు.