మొదట హేతుబద్ధీకరణ, ఆ తర్వాత బదిలీలు, పదోన్నతులు అమరావతి: ఉపాధ్యాయుల బదిలీల్లో ఈసారి పోస్టులను బ్లాక్
చేయకూడదని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
గత ప్రభుత్వంలో కొన్ని పోస్టులను బ్లాక్ చేయడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. దాంతో ఈసారి పోస్టుల హేతుబద్దీకరణ, బదిలీలు, పదోన్నతులను ఒక దాని తర్వాత మరొకటి నిర్వహిస్తారు.
ఇప్పటికే సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు సైతం చేపట్టింది. తొలుత పోస్టుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఇవ్వనుంది. ఆ తర్వాత పదో న్నతులకు 1.2 విధానంలో జాబితా విడుదల చేసి, అభిప్రాయాలు తీసుకోనుంది.
Related News
ఏదైనా పాఠశాలలో బదిలీ, పదోన్నతులతో 50% కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు రిలీవ్ కావాల్సి వస్తే నూతన డీఎస్సీ ఉపాధ్యాయులు వచ్చే వరకు 50% పైన ఉన్న వారిని నిలిపివేస్తారు. మరోవైపు జూన్ 5 నుంచి 11 వరకు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. పాఠశా లల పునఃప్రారంభమైన వెంటనే వారం రోజులపాటు విద్యార్థుల ప్రవేశాలకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. జూన్ 28న తల్లిదండ్రులు, ఉపాధ్యా యుల సమావేశం ఏర్పాటు చేస్తారు.