SALARY HIKE: అంగన్‌వాడీలకు తీపి వార్త..జీతాలు పెంపు..!!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలకు ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వారి జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ టీచర్లను అంగన్‌వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు ఇప్పుడు అంగన్‌వాడీ టీచర్లుగా పనిచేయనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో మినీ, మెయిన్ అంగన్‌వాడీల మధ్య తేడా ఉండదు. గతంలో మినీ అంగన్‌వాడీలకు రూ.7800 జీతం మాత్రమే ఇవ్వగా.. తాజా నిర్ణయంతో వారికి రూ.13,650 జీతం అందనుంది.

పెరిగిన జీతం ఏప్రిల్ నుంచి వారి ఖాతాల్లో జమ అవుతుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది అంగన్‌వాడీ టీచర్లు ప్రభుత్వం జీతాలు పెంచాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా, తమకు పదోన్నతులు, జీతాల పెంపుదల ఇచ్చినందుకు మంత్రి సీతక్కకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Related News