తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సూర్యుడు అస్తమించిన తర్వాత శుక్రవారం రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా ప్రమాదాలు కూడా జరిగాయి. తెలుగు రాష్ట్రాలకు ఈరోజు కూడా వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డీఎంఏ హెచ్చరించింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వర్షం సమయంలో ప్రజలు బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, రాయలసీమ, తూర్పు గోదావరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.