Birth date: అమ్మాయిలకు హెచ్చరిక.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలతో జాగ్రత్త…

పెళ్లైన తరువాత భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే సామర్థ్యం చాలా ముఖ్యమైన విషయం. కానీ కొన్ని సందర్భాల్లో భార్యలు ఎంతగా ప్రయత్నించినా భర్తలు తమ మాట వినకుండా ఉండిపోతారు. కొన్నిసార్లు ఈ విషయం నెమ్మదిగా గొడవలకూ దారి తీస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదు. కొంతమందిలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారు, ముఖ్యంగా భర్తలుగా ఉన్న వారు, తమ భార్యల మాటలను పట్టించుకోవడం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి వారి స్వభావం చిన్నచిన్న విషయాల్లోనూ భార్యలకు బాధ కలిగించేలా ఉంటుంది.

భర్తల మతిమరుపు

చాలా మంది భార్యలు తరచూ ఒకే విషయంపై గట్టిగా వాపోతూ ఉంటారు. “నా భర్తకు పెళ్లిరోజు గుర్తుండదు”, “పుట్టినరోజు కూడా గుర్తు పెట్టుకోడు” అంటూ ఎన్నోసార్లు భర్తలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పినా, వారు పెద్దగా వినకపోవడం, అలసత్వంగా స్పందించడం కామన్. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు అయితే అస్సలు భార్య చెప్పిన విషయాలను గమనించరంటూ న్యూమరాలజీ విశ్లేషణ చెబుతోంది.

జన్మతేదీ 1, 10, 19, 28 – అహంకారంతో నిండిన నాయకత్వ భావన

ఈ తేదీల్లో పుట్టిన భర్తలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు తమను నాయకుడిగా భావిస్తారు. ఎవరు ఏం చెప్పినా.. తన మాటే సరైందని నమ్మకం ఉంటుంది. ఈ స్వభావం వల్ల వాళ్ల జీవితంలో ఎదుటివారు చెప్పినది విలువ లేకుండా పోతుంది. భార్య చెప్పిన మాటలు చిన్నచూపు పడతారు.

“ఆమె ఏమి చెబుతుందిలే?” అనే భావన వాళ్ళలో ఉండటం వల్ల మాట వినడమే మానేస్తారు. నిజానికి, వారిలో ఉండే ఈ లీడర్‌షిప్ ఫీలింగ్ వల్లే తమకు అన్నీ తెలుసన్న ఫీల్ పెరిగి, ఇతరుల మాటలు వినకపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల భార్య ఎంత మంచిగా చెప్పినా పట్టించుకోరు.

జన్మతేదీ 5, 14, 23 – శ్రవణశక్తి ఉన్నా భార్య మాటలకు డెఫెన్స్ మోడ్

ఈ తేదీల్లో పుట్టిన వారు బాగానే వింటారు భార్యా మాటలు తప్ప. ఎవరైనా ఫ్రెండ్ చెబితే ఆనందంగా వింటారు. కానీ భార్య ఏమన్నా అంటే “అదేమిటి అంత సీరియస్‌గా” అని ముఖం తిప్పుతారు. ఇలాంటి వ్యక్తులకి భార్య చెప్పే విషయాలు గమనించాలి అనే ఆసక్తి ఉండదు. వింటున్నట్టు నటించి, అసలే వినకుండా ఉండిపోతారు. ఆసక్తిగా ఉన్నా.. భార్య వల్ల బోర్ అనిపిస్తుంది. కానీ భార్య కాకుండా ఎవరో మూడో వ్యక్తి అదే మాట చెబితే మాత్రం శ్రద్ధగా వింటారు. ఇది భార్యలలో అసంతృప్తిని మరింత పెంచుతుంది.

జన్మతేదీ 9, 18, 27 – హడావిడిలో అంతా మర్చిపోయే టెన్షన్ జెంట్స్

ఈ తేదీల్లో పుట్టిన వారు చాలాసార్లు హడావిడిగా ఉంటారు. వాళ్ల జీవితంలో ఏదో ఒక పని నడుస్తూనే ఉంటుంది. ఫోకస్ సరిగా ఉండదు. ఈ కారణంగా ఎదుటివారి మాటల్ని పట్టించుకోవడం మానేస్తారు. ముఖ్యంగా భార్యలు ఏదైనా చెబితే “అవునా?” అంటూ తల ఊపుతారు కానీ అసలు వినరు.

కొన్ని సందర్భాల్లో భార్య రిపీట్ చేసినా, పట్టించుకోవడం లేదు. దీనివల్ల భార్యలు భావోద్వేగంగా వ్యతిరేకిస్తారు కానీ భర్తలు మాత్రం “అది అంత ముఖ్యమా?” అనే ధోరణిలో ఉంటారు.

మగవారి ఈగోకి భార్యలు బాధపడుతున్నారు

వివాహ జీవితం అనేది ఇద్దరూ సమానంగా అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది భర్తలు, ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారు, భార్యల మాటలకు విలువ ఇవ్వకుండా తమ ఈగోలో మునిగి ఉంటారు.

ఇది భార్యలకు భాదను కలిగించడమే కాదు, సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు చిన్నపాటి మాటలు వదిలేయవచ్చు కానీ, ఎప్పటికీ పట్టించుకోకపోతే మనసులు దూరంగా మారిపోతాయి.

మీ భర్త జన్మతేది వీటిలో ఉందా?

మీ భర్త పుట్టిన తేదీ కూడా 1, 5 లేదా 9 సిరీస్‌లో ఉందా? అయితే మీరు ఎప్పటికప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటున్న అవకాశముంది. ఇది న్యూమరాలజీతోనో, వ్యక్తిత్వంతోనో సంబంధం ఉండవచ్చు.

కానీ ఒక నిజం మాత్రం మర్చిపోవద్దు – సంబంధాన్ని బలంగా నిలబెట్టాలంటే అర్థం చేసుకోవడం, గౌరవించడం చాలా అవసరం. ఎంత బిజీ అయినా సరే.. భార్య చెప్పే ఒక్క మాట కూడా ముఖ్యం అనిపించాలి. ఒక అవకాశం ఇవ్వండి.. మీ బంధం గట్టిగా నిలబడుతుంది.

చివరగా చెప్పాలంటే…

భార్యలు ఒక్క మాట చెప్పాలన్నా పెద్దగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికంటే బాధాకరమైన విషయం ఇంకేదీ ఉండదు. ఈ మార్గం మారాలంటే ఆత్మ పరిశీలన అవసరం. కనీసం భార్యలు చెప్పే విషయాలను ఓసారి పట్టించుకుంటే.. ఎంతో తేలికగా సమస్యలు పరిష్కారమవుతాయి. లేదంటే, ఓరోజు అవి పెద్దగా మారి దూరాలకే దారి తీస్తాయి.

ఇక మీ పెళ్లికాని ఫ్రెండ్స్‌కు ఈ డేట్స్ చెప్పేయండి! ముందే అలర్ట్ అవుతారు.