వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తేనే.. నాకు చెమటలు పడుతున్నాయి. వేసవిలో అత్యంత ఇబ్బందికరమైన సమస్య ఏమిటంటే..? వడదెబ్బ. అధిక ఉష్ణోగ్రతలు, వేడి కారణంగా, బయట పనికి వెళ్ళే వారికే కాదు.. వృద్ధులు, ఇంట్లో ఉండే పిల్లలు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ వడదెబ్బను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు తెలుసుకుందాం..
1. మీరు ఖచ్చితంగా రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి.
2. చక్కెర పానీయాలు, కాఫీకి దూరంగా ఉండండి
3. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లడం మంచిది.
4. మీరు పనికి వెళ్ళవలసి వస్తే, సూర్యుడు అస్తమించే ముందు మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్లాన్ చేసుకోండి
5. తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులు మంచి ఎంపిక
6. కొబ్బరి నీరు, నిమ్మరసం ఉప్పుతో కలిపి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి నింపుతుంది. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మలు, చిలగడదుంప వంటి పండ్లు తీసుకోవాలి.