ప్రభుత్వం ఉగాది కానుక.. ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు మరియు రేషన్ కార్డు ఉన్నవారికి ఇది సూపర్ న్యూస్… రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా బియ్యం అందించేందుకు ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున (మార్చి 30) సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.

ఎవరికీ, ఎంత బియ్యం దొరుకుతుంది?

  •  రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం అందుతుంది.
  •  కార్డులో ఎంత మంది ఉన్నారో, ప్రతి ఒక్కరికీ 6 కేజీల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు.
  •  ముందుగా అందిస్తున్న Doddu Rice స్థానంలో ఉచిత బియ్యం అందించనున్నారు.

నాలుగు నెలలపాటు సరిపడే స్టాక్ రెడీ…

  •  తెలంగాణ ప్రభుత్వం బియ్యం నిల్వలను సిద్ధం చేసింది.
  •  ప్రభుత్వం వరి సేకరించి, రైస్ మిల్స్ లో మిల్లింగ్ చేసి 8 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధం చేసింది.
  •  ఇది రాష్ట్రంలోని డిపోలలో నిల్వ చేయబడింది.
  •  అక్కడి నుంచి మండల స్థాయిలో పంపించి, రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తారు.
  •  ఈ స్టాక్ నాలుగు నెలలపాటు సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

500 రూపాయల బోనస్ – రైతులకు అదనపు లాభం…

  •  రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
  •  ఖరీఫ్ సీజన్లో పండించిన సన్న బియ్యానికి ప్రతి క్వింటాల్ పై ₹500 అదనపు బోనస్ ఇవ్వనున్నారు.
  •  ఇది రైతులకు మంచి లాభాన్ని అందించనుంది.

స్మార్ట్ రేషన్ కార్డులు – ఇక నుంచి QR కోడ్ తో…

  •  ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టనున్నారు.
  •  ఈ కార్డుల్లో ప్రత్యేకంగా QR కోడ్ ఉంటుందిని ప్రభుత్వం ప్రకటించింది.
  •  ఇప్పుడు డిజైన్ పనులు జరుగుతున్నాయి, త్వరలోనే విడుదల కానున్నాయి.

ఏప్రిల్ 1 తర్వాత రేషన్ దుకాణాలకు వెళ్లండి – ఉచిత బియ్యం తీసుకోండి…

  •  ఏప్రిల్ 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ మొదలవుతుంది.
  •  మీ రేషన్ కార్డుతో దగ్గరిలోని రేషన్ షాపుకి వెళ్లి ఉచిత బియ్యం పొందండి.
  •  ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు…

తెలంగాణ ప్రజలకు ఇది మంచి వార్త. ఇకపై రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం అందుతుంది. మీ కుటుంబ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now