పెన్షన్ ప్లానింగ్ అనేది జీవితం మొత్తం ఆర్థిక భద్రత కోసం కీలకం. వృద్ధాప్యంలోనూ జీవన ప్రమాణం తగ్గకుండా ఉండాలంటే, రిటైర్మెంట్ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మీరు 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలి, నెలకు ₹80,000 ఆదాయం రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? SIP మాదిరిగా నెలవారీగా పెట్టుబడి పెట్టాలా? లేక ఒకేసారి లంప్ సమ్ పెట్టుబడి పెట్టాలా? వయస్సును బట్టి ఈ లెక్కలు ఎలా మారతాయి? తెలుసుకోండి.
పెన్షన్ ప్లానింగ్ ఎందుకు ముఖ్యం?
- ఇన్ఫ్లేషన్ ప్రభావం: ప్రస్తుతం ₹100 విలువ ఉన్న వస్తువు భవిష్యత్తులో ₹500 కావొచ్చు. రిటైర్మెంట్ సమయానికి అవసరమైన మొత్తం ఇప్పుడు ఊహించుకోవడం ముఖ్యం.
- పన్నులు & వడ్డీ రేట్లు మార్పులు: పెట్టుబడులపై పన్నులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ మారుతుండటంతో రిటైర్మెంట్ కోసం సరైన ఫండ్ ఏర్పరుచుకోవడం అవసరం.
- నెలకు కావాల్సిన ఆదాయం: మీరు వృద్ధాప్యంలో ఖర్చులను, జీవన ప్రమాణాన్ని అనుసరించి అంచనా వేసుకోవాలి.
60 ఏళ్ల తర్వాత నెలకు ₹80,000 రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి?
25 ఏళ్ల వయస్సు
- Total Retirement Corpus: ₹14,75,72,880
- SIP: ₹22,720
- Lump Sum: ₹27,94,962
30 ఏళ్ల వయస్సు
- Total Retirement Corpus: ₹11,02,74,960
- SIP: ₹31,240
- Lump Sum: ₹36,80,750
35 ఏళ్ల వయస్సు
- Total Retirement Corpus: ₹8,24,04,000
- SIP: ₹43,425
- Lump Sum: ₹48,47,276
40 ఏళ్ల వయస్సు
- Total Retirement Corpus: ₹6,15,77,040
- SIP: ₹61,630
- Lump Sum: ₹63,83,493
రిటైర్మెంట్ కార్పస్ లెక్కలు ఎలా చేస్తారు?
- రిటైర్మెంట్ వయస్సు – 60 సంవత్సరాలు
- అవసరమైన కాలం – 20 సంవత్సరాలు (80 ఏళ్ల వరకు)
- ప్రస్తుతం నెలకు ఖర్చు – ₹80,000
- ఇన్ఫ్లేషన్ రేటు – 6%
- Pre-Retirement Return – 12% (పన్నుల తర్వాత)
- Post-Retirement Return – 6% (పన్నుల తర్వాత)
ఎవరికి ఏదీ బెస్ట్?
- 25-30 ఏళ్ల వయస్సులో ఉన్నవారు SIP ద్వారా పెట్టుబడి పెడితే, తక్కువ మొత్తం సరిపోతుంది.
- 35-40 ఏళ్ల తర్వాత ప్రారంభిస్తే, లంప్ సమ్ పెట్టుబడి ఎక్కువగా పెట్టాలి లేదా మాసిక SIP ఎక్కువగా పెట్టాలి.
- ఆలస్యం చేస్తే పెట్టుబడి భారం పెరుగుతుంది.
ఇప్పుడు మొదలు పెడితే, భవిష్యత్తులో సుఖంగా జీవించవచ్చు.