ప్రస్తుతం మార్కెట్‌లో చాలా బిజినెస్ అవకాశాలు ఉన్నాయి. కానీ, చాలా మంది వాటి గురించి తెలియక చాలా మంచి లాభాలను కోల్పోతున్నారు. మీరు కూడా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? అయితే, టాయ్ బిజినెస్ మీకు బెస్ట్ ఆప్షన్.
టాయ్ బిజినెస్ ఎందుకు మంచి ఐడియా?
- టాయ్ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది – పిల్లలు టాయ్స్ కనిపిస్తే వెంటనే కొనాలని మొగ్గుచూపుతారు.
- ఇండియన్ టాయ్ మార్కెట్ బూస్ట్ అవుతోంది – గతంలో దేశంలో అమ్ముడయ్యే టాయ్స్‌లో 85% విదేశాల నుంచి దిగుమతి చేసేవారు. ఇప్పుడు భారతదేశం టాయ్స్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది.
- ఇండియన్ టాయ్స్‌కు గ్లోబల్ డిమాండ్ – ఇప్పుడు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోనూ భారతీయ టాయ్స్ వినియోగం పెరిగింది.
- గత 3 ఏళ్లలో టాయ్ దిగుమతులు 70% తగ్గాయి, ఎగుమతులు 60% పెరిగాయి.
ఎలా స్టార్ట్ చేయాలి?
- చిన్న స్థాయిలో ప్రారంభించి, ఆ తర్వాత బిజినెస్‌ను పెద్దదిగా మార్చుకోవాలి.
- ఇంటి వద్దే సాఫ్ట్ టాయ్స్, టెడ్డీ బేర్ తయారీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
- మొదట్లో ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. రూ.40,000 పెట్టుబడి ఉంటే చాలు
లాభం ఎంత వస్తుంది?
- రూ.40,000 పెట్టుబడి పెడితే, దాంతో 100 టాయ్స్ తయారు చేయొచ్చు.
- ఒక్కో టాయ్ ధర రూ.250 – 400 ఉంటే, 1000 యూనిట్లు అమ్మితే నెలకు రూ.1,00,000 వరకు సంపాదించవచ్చు
- ముడి సరుకు ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ
ఈ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలి?
- ఇంట్లోనే చిన్న లెవెల్‌లో మొదలుపెట్టి ఆన్‌లైన్, మార్కెట్ల ద్వారా అమ్మొచ్చు.
- డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట షాపులు పెట్టుకోవచ్చు.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా డైరెక్ట్ కస్టమర్లకు అమ్మవచ్చు.
ఈ బిజినెస్ మిస్ అవ్వొద్దు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్. ఇంట్లోనే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న రంగం కావడం వల్ల రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరుగుతుంది.
ఇంకెందుకు ఆలస్యం? మీ బిజినెస్ ప్లాన్ చేసుకుని, మంచి లాభాలు అందుకోండి