రిటైర్మెంట్ కోసం SIP + SWP – స్ట్రాంగ్ ప్లాన్
ఒకప్పుడు రిటైర్మెంట్ అంటే పెన్షన్, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆధారపడడం మాత్రమే. కానీ ఇప్పుడు SIP (Systematic Investment Plan) + SWP (Systematic Withdrawal Plan) ద్వారా రెగ్యులర్ ఆదాయం పొందటం చాలా సులభం.
మీరు 25 ఏళ్ల వయసులో ₹15,000 SIP ప్రారంభించి, 50 ఏళ్లకు రిటైర్ అయ్యే సరికి నెలకు ₹1,67,000 పొందవచ్చు
ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం
Related News
ఎందుకు త్వరగా రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి?
- ఆర్థిక స్వాతంత్ర్యం – ఎవరిపై ఆధారపడక్కుండా సొంత ఖర్చులను తానే నిర్వహించుకోవచ్చు.
- లైఫ్ గోళ్స్ పూర్తి చేయడం సులభం – త్వరగా ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ మొత్తంతో ఎక్కువ లాభం.
- పదవి విరమణను ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు – 50 ఏళ్లకే రిటైర్ అవ్వాలి అంటే 25 ఏళ్ల నుంచే ప్లాన్ చేయాలి.
SIP ద్వారా ఎంత ఫండ్ క్రియేట్ అవుతుంది?
మీరు ₹15,000 నెలకు SIP పెట్టుకుంటూ 25 సంవత్సరాలు (50 ఏళ్లు వరకు) ఇన్వెస్ట్ చేస్తే:
- మొత్తం పెట్టుబడి – ₹45,00,000
- అంచనా కాంపౌండెడ్ లాభంతో మొత్తం ఫండ్ – ₹2,84,64,526 (12% వార్షిక రాబడి ఆధారంగా)
- ఈ మొత్తం మీ రిటైర్మెంట్ అవసరాలను సులభంగా కవర్ చేస్తుంది
SWP ద్వారా నెలకు ₹1,67,000 ఆదాయం – ఎలా?
50 ఏళ్లకు చేరుకున్న తర్వాత, మీరు ఈ మొత్తం మొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా SWP ప్లాన్ ద్వారా నెలకు రెగ్యులర్ ఆదాయం పొందవచ్చు.
అంటే, ₹2,52,45,019 ఫండ్‌ను 7% రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచితే:
- నెలకు ఆదాయం – ₹1,67,000
- 30 సంవత్సరాల పాటు మొత్తం విత్‌డ్రా చేసిన మొత్తం – ₹6,01,02,000
- చివరకు బ్యాలెన్స్ – ₹38,875
మీరు 80 ఏళ్ల వరకు లైఫ్ స్టైల్ మార్చుకోకుండా రెగ్యులర్ ఆదాయం పొందవచ్చు.
SIP + SWP ప్లాన్ ప్రయోజనాలు
- సేవింగ్స్ అలవాటు – చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ, పెద్ద మొత్తంగా సంపాదించవచ్చు.
- పెద్ద మొత్తంలో తక్షణ పెట్టుబడి అవసరం లేదు – మాములుగా నెలకు రూ.15,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు.
- మార్కెట్ డౌన్ ఉన్నా ఇబ్బంది ఉండదు – SIP ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం తక్కువ.
- టాక్స్ ప్రయోజనాలు – దీర్ఘకాలిక పెట్టుబడి (LTCG) పై టాక్స్ ప్రయోజనం లభిస్తుంది.
(డిస్క్లైమర్: ఇది పెట్టుబడి సలహా కాదు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.)