Lifestyle: మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా .. చాణుక్యుడు ఏం చెప్పారంటే..?

మనలో చాలామంది భోజనం తర్వాత కాసేపు నిద్రపోతారు. ఇది నిజంగా మంచి అలవాటునా? చాలా మందికి దీనిపై సందేహాలు ఉంటాయి. నేటి జీవనశైలిలో, నిద్రించడానికి సరైన సమయం లేదు. సమయం లేదా సందర్భం లేకుండా నిద్రపోవడం సంపద, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని కొందరు వాదిస్తున్నారు. అయితే, చాణుక్యుడు దీని గురించి ఏమి చెబుతున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఒక వ్యక్తి జీవితంలో నిద్ర చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. చాణుక్యుడు మధ్యాహ్నం నిద్ర గురించి స్పష్టమైన సమాచారం ఇచ్చాడు. పగటిపూట నిద్రపోయేవారు త్వరగా చనిపోతారని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో ఒక వ్యక్తి ఎక్కువగా శ్వాస తీసుకుంటాడు. అందువల్ల, వారు ఆ సమయంలో నిద్రపోకూడదు. అలాగే, వారి విజయ రేటు తగ్గుతుంది. వారు పనిపై దృష్టి పెట్టరని చాణుక్యుడు చెప్పాడు. అంతే కాదు, వారు ఏదైనా పనిని ఇచ్చిన వెంటనే మర్చిపోతారు.

చాణక్యుడు మాత్రమే కాదు, వైద్యులు కూడా మధ్యాహ్నం నిద్ర మంచిది కాదని అంటున్నారు. ఇలా నిద్రపోయేవారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే, 15 నుండి 30 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి. పగటిపూట ప్రతిరోజూ 2 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల హృదయ స్పందనలో మార్పులు సంభవిస్తాయని, గుండెపోటుకు దారితీస్తుందని చెబుతున్నారు. దీనిపై పరిశోధన చేసిన నిపుణులు కూడా మధ్యాహ్నం నిద్రపోయేవారు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి, వీలైనంత వరకు రాత్రిపూట మాత్రమే నిద్రపోండి.

Related News