గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే ప్రయాణం..

Guntur to Secunderabad  మార్గం ప్రస్తుతం single line గా ఉంది. దీంతో ఒక రైలును ఎదురుగా వచ్చే మరో రైలును ముందుగా పంపాలంటే సింగిల్ లైన్ కావడంతో కొన్ని railway stations లో ప్రయాణించే రైళ్లను ఆపాల్సి వస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీంతో రైలు రన్నింగ్ టైం ఆలస్యమవుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో నల్లపాడు-నడికుడి-బీబీనగర్ మార్గం అత్యంత ముఖ్యమైనది. దీని పొడవు 239 కి.మీ. ఎప్పటి నుంచో డబుల్ లైన్ చేయాలనే డిమాండ్లపై కేంద్రం స్పందించి ఆమోదం తెలిపింది.

The center is green

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.2854 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో సివిల్ పనులకు రూ.1948 కోట్లు ఖర్చు చేయనున్నారు. సిగ్నలింగ్, టెలికాం పనులకు రూ.320 కోట్లు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.587 కోట్లు అంచనా వేశారు. ఈ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల ద్వారా మంచి ఆదాయం వస్తోంది. బొగ్గు, సిమెంట్ రవాణాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా రవాణా అవుతున్నాయి. రామాపురం, జగ్గయ్యపేట, మేళ్లచెరువు, జాన్ పహాడ్, నడికుడి, విష్ణుపురంలో సిమెంట్ పరిశ్రమలున్నాయి.

Cement, Steel, FCI warehouses

నార్కట్‌పల్లి, చిట్యాలలో ఇనుము, ఉక్కు పరిశ్రమలు, విష్ణుపురంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, నాగిరెడ్డిపల్లి, నల్గొండ, మిర్యాలగూడలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోదాములు ఉన్నాయి. రెండో లైన్ నిర్మిస్తే వారందరికీ ఎంతో మేలు జరుగుతుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ చేరుకోవడానికి ప్రస్తుతం రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

Bibinagar-Nadikudi-Guntur  మార్గంలో తక్కువ దూరం ఉంటుంది. మరో మార్గం ఖాజీపేట-ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి నడికుడి మరియు గుంటూరు మీదుగా చెన్నై మరియు తిరుపతికి సమీప మార్గం. ప్రస్తుతం ఉన్న ట్రాక్ గంటకు 148 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలదు. 150 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా కొత్త రైలు మార్గాన్ని నిర్మించే అవకాశం ఉంది. డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి రెండున్నర నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.