
సాధారణంగా విడాకుల కేసుల్లో.. భార్యకు భర్త భరణం ఇవ్వాల్సి ఉంటుంది. చాలా కుటుంబాల్లో వివాహానంతరం స్త్రీలు ఇంటి పనులకే పరిమితమై కుటుంబ సభ్యులను చూసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు, వారి సంబంధం విచ్ఛిన్నమైతే, చాలా సంవత్సరాలుగా తమ ఇళ్లకే పరిమితమైన మహిళలు విడిపోయిన తర్వాత తమకు ఉపాధిని కనుగొనలేరు. కాబట్టి విడాకుల కేసుల్లో, విడిపోయిన తర్వాత భర్త తన భార్యకు భరణం ఇవ్వాలని కోర్టులు ఆదేశిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో భార్య భర్తకు భరణం కూడా ఇవ్వాలని కొన్ని court recently announced నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతురి తల్లికి భరణం ఇవ్వాలని సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..
పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి మాత్రమే కాదని, వారి శ్రేయస్సుకు కూడా బాధ్యత వహిస్తారని.. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదని కోర్టు అభిప్రాయపడింది. తండ్రి చనిపోవడంతో.. ఓ కూతురు తల్లిని తన ఇంటికి పిలిపించి.. ఆస్తిని లాక్కొని.. ఆపై తల్లిని బయటకు గెంటేసింది. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అన్నదమ్ముల ఆస్తిలో హక్కు క్లెయిమ్ చేసే కూతురికీ, వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని నమ్ముతారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ మేరకు Indore court సంచలన తీర్పునిచ్చింది. వృద్ధాప్య తల్లికి జీవన భృతి కింద కుమార్తె పోషణను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Madhya Pradesh కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు తన కుమార్తె (55)పై కోర్టులో కేసు వేసింది. తనకు ఒకే ఒక్క కుమార్తె ఉందని.. తన ఆస్తినంతా లాక్కొని.. covid సమయంలో ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టిందని వృద్ధురాలు ఆరోపించింది. తన భర్త Madhya Pradesh State Road Transport Corporation గా పనిచేస్తున్నాడని తెలిపింది. అతను 2001లో మరణించాడని.. తన భర్త చనిపోయినప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్నానని.. ఈ క్రమంలో Covid రాకముందే కూతురు తన ఇంటికి తీసుకెళ్లిందని తెలిపింది.
[news_related_post]కొద్ది రోజులుగా తనను బాగా చూసుకున్నానని, ఆ తర్వాత అతని పేరు మీద ఉన్న పిత్రార్జిత ఇంటిని అమ్మి డబ్బులు తీసుకున్నానని బాధితురాలు తెలిపింది. కూతురు కూడా తన భర్త EPF account నుంచి డబ్బులు తీసుకుందని చెప్పింది. తన సొత్తు అంతా దోచుకున్నారని చెప్పింది.
అప్పటి నుంచి తాను చిత్ర హింసలకు గురవుతున్నానని.. ముఖ్యంగా 2020 march లో విధించిన lockdown సమయంలో.. తన కూతురు తనను చాలా బాధకు గురి చేసిందని వృద్ధురాలు వెల్లడించింది. తనను ఇంటి నుంచి గెంటేశారని చెప్పింది. కూతురి మాటలు నమ్మి సర్వం కోల్పోయానని.. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. తన కూతురు ఆస్తినంతా లాక్కుందని.. ఇప్పుడు ఉండేందుకు స్థలం లేదని.. తిండికి కూడా ఇబ్బంది పడుతున్నానని వృద్ధురాలు వాపోయింది.
తన కూతురు చీరల దుకాణం నిర్వహిస్తూ నెలకు రూ.22 వేల వరకు సంపాదిస్తున్నదని, తనకు భరణం ఇవ్వాలని వృద్ధురాలు కోర్టులో దాఖలు చేసిన petition లో పేర్కొంది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి మాయా విశ్వలాల్.. కూతురు తన తల్లిని ఆదుకునే స్తోమత ఉందని నిర్ధారించారు. కూతురు, వృద్ధురాలికి నెలకు రూ.3 వేల చొప్పున భరణం చెల్లించాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ తీర్పు సంచలనంగా మారింది.