Suzuki e-Access: సింగిల్​ ఛార్జ్​తో 95 కి.మీ రేంజ్- సామాన్యుల కొరకు అందుబాటుల ధరలో!

Suzuki e-Access: మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. సుజుకి కంపెనీ ఇటీవల Suzuki e-Access ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేస్తునట్టు ప్రకటించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మోడల్ యొక్క పూర్తి వివరాలను దాని రేంజ్ మరియు బ్యాటరీతో పాటు ఇతర విషయాలు ఇక్కడ తెలుసుకోండి..

Suzuki e-Access

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి ప్రవేశించింది! సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025లో కొత్త Suzuki e-Access ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 సిసి పెట్రోల్ స్కూటర్ యొక్క EV వెర్షన్‌గా మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది.

ఈ ఇ-స్కూటర్ సింపుల్ స్టైలింగ్ మరియు ఈజీ గా ఉండే స్పెసిఫికేషన్‌లతో సామాన్యుడు కొనుగోలు చేసే విధం గా ఉంటుంది. కొత్త Suzuki e-Access ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, అథర్ రిజ్టా, ఓలా S1 వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది అని చెప్తున్నారు.

ఈ స్కూటర్‌లో 3 రైడింగ్ మోడ్‌లు ఉంటాయి – ఎకో, రైడ్ ‘A ‘, రైడ్ ‘B ‘ – అలాగే రివర్స్ మోడ్. ఈ-యాక్సెస్ మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది – మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం. 2/ మెటాలిక్ మ్యాట్ బోర్డియక్స్ రెడ్, పెర్ల్ గ్రే వైట్/ మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే, పెర్ల్ జాడే గ్రీన్/ మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే.

Suzuki e-Access స్పెసిఫికేషన్స్..

రాబోయే సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.07 kWh LFP బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీ (IDC) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని 4.1 kW (5.4 bhp) ఎలక్ట్రిక్ మోటార్ 15 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 71 కి.మీ.కి పరిమితం చేయబడింది. బ్యాటరీ 0-80 శాతం నుండి ఛార్జ్ కావడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. 240-వాట్ పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి పూర్తి ఛార్జ్ 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ఛార్జింగ్ సమయాన్ని 1 గంట 12 నిమిషాలు (0-80 శాతం) మరియు 2 గంటల 12 నిమిషాలు (0-100 శాతం) తగ్గిస్తుంది.

డైమెన్షన్స్​ పరంగా, ఈ-యాక్సెస్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ 1,880 ఎంఎం పొడవు, 715 ఎంఎం వెడల్పు, 1,140 ఎంఎం ఎత్తు, 1,305 ఎంఎం పొడవైన వీల్​బేస్ కలిగి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 ఎంఎం, సీటు ఎత్తు 765 ఎంఎం. దీని బరువు 122 కిలోలు.

PRICE: ధర షుమారు గా 1 లక్ష వరకు ఉండొచ్చు అని సమాచారం